Allu Sneha Reddy : అల్లు స్నేహ రెడ్డి పై శ్రీజ భర్త కామెంట్స్ ఇక మండి పడుతున్న బన్నీ ఫ్యాన్స్..

Updated on: August 17, 2022

Allu Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలుసు. ఇక ఆయన సతీమణి కూడా అంతే పాపులారిటీ తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య రీసెంట్ గా శారీలో తను పోస్ట్ చేసిన పిక్స్ పై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అతని భార్య స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ల దాంపత్యం జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ నీ మాత్రం ఎప్పుడు దూరం చేసుకోడు కాస్త సమయం దొరికినా తన ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడు.

kalyan-dev-reacts-allu-sneha-reddy-photo-shoot
kalyan-dev-reacts-allu-sneha-reddy-photo-shoot

Allu Sneha Reddy :  కళ్యాణ్ దేవ్ అల్లు స్నేహ ఫొటోస్ పై కామెంట్….

తన భార్యతో పాటు పిల్లల్ని విదేశాలకు, విహారయాత్రకు తీసుకెళ్తాడు. ఇక వారు ఎక్కడికెళ్లినా ఫ్యామిలీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులతో పంచుకుంటాడు. ఇక తన పిల్లలకు సంబంధించిన పిక్స్ ఎక్కువగా షేర్ చేస్తుంటాడు. అలాగే తన భార్య స్నేహారెడ్డి కూడా ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది. తాజాగా స్నేహ రెడ్డి దిగిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.  ఇక అందరూ ఆమె ఫోటోల గురించి చర్చించుకుంటున్నారు. స్నేహ రెడ్డి రీసెంట్ గా డిజైనర్ శారీ లో ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. స్టార్ హీరోయిన్ లకి ఏ మాత్రం తగ్గకుండా అందర్నీ మైమరిపించింది. ఇక ఈ ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.

ఇక ఆ ఫొటోస్ పై తన ఫ్యాన్స్ చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ అల్లు స్నేహ ఫొటోస్ పై కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. స్నేహ పోస్ట్ చేసిన ఫోటో పై ఫైర్ ఎమోజి నీ వదులుతూ “స్నేహ” అంటూ కామెంట్ చేశాడు. ఇలా ఏకవచనంతో మాట్లాడడం ఫైర్ ఎమోజి నీ వదలడం పట్ల అల్లు ఫాన్స్ కళ్యాణ్ దేవ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాస్త రెస్పెక్ట్ ఇవ్వు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు స్నేహ గ్లామర్ ని పొగుడుతూ తన లుక్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ వదినమ్మ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విధంగా స్నేహ పట్ల కళ్యాణ్ దేవ్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Read Also : Allu sneha reddy : పిల్లల ఫోటోస్ షేర్ చేసిన అల్లు అర్జున్ సతీమణి.. ఎంత క్యూట్ ఉన్నారో!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel