Puspha Song: స్కర్ట్ ధరించి సామి… సామి అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన యువకుడు.. వీడియో వైరల్!

Puspha Song: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది. మారుమూల గ్రామాలలో ఉండే వారు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువయింది. సామాన్యులు సెలబ్రిటీలు అని కాకుండా ప్రస్తుత కాలంలో అందరూ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉంటున్నారు. తద్వారా చిన్న విషయమైనా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో సామి స్వామి పాట మంచి హిట్ అయ్యింది. ఎంతోమంది ఈ పాటకు డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటీవల ఈ పాటకు గాను ఒక యువకుడు వేసిన డాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. అమ్మాయిలు వేసుకునే లాంగ్ స్కర్ట్ ధరించి ఈ యువకుడు సామి స్వామి పాటకు వేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భారత సంతతికి చెందిన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా అమెరికాలో ఉంటూ తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్‌లు చేస్తున్నాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలను బాగా నేర్చుకున్న ఇతను ఇప్పుడు వాటిని అమెరికాలో ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నాడు. తాజాగా జైనిల్ స్కర్ట్ ధరించి… అమెరికా వీధుల్లో పుష్ప సినిమాలోని సామి సామి పాటకు డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో బాగా వైరల్ అయ్యింది.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

Advertisement

అంతకు ముందు ఇలాగే లాంగ్ స్కర్ట్ వేసుకొని ఆలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి సినిమాలోని ఝూమ్ రే గోరీ పాటకి తన స్టైల్ లో అదిరిపోయే గార్భా స్టెప్స్ వేశాడు. ఇతడి డ్యాన్స్‌లను చూసి కొందరు నెటిజన్లు మెచ్చుకోగా.. మరికొందరు మాత్రం.. ఎప్పుడు అమ్మాయిల డ్రస్సులు వేసుకొని డాన్స్ చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు .

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel