Horoscope: ఈరోజు అనగా ఆగస్టు 9వ తేదీ మంగళవారం రోజు పన్నెండు రాశుల వాళ్లు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈరెండు రాశుల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈరోజు అస్సలే శత్రువుల జోలికి పోకూడదని అంటున్నారు.
మేష రాశి.. మేష రాశి వాళ్లు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఎవ్వరితోనూ విభేదించకండి. ముఖ్యంగా శత్రువులకు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో గొడవ పడొద్దు. మాట విలువను కాపాడుకోవాలి. సజ్జనులతో కాలాన్ని గడుపుతారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది.
మిథున రాశి.. మిథున రాశి వాళ్లు ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండడం మంచిది. ఏమాత్రం అలసత్వం వహించినా చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక వార్త బాధ కల్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం.