Devatha july 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పిల్లలు మాధవని చెస్ ఆడడానికి పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ పిల్లలు చెస్ ఆడడానికి పదే పదే పిలుస్తూ ఉండడంతో సరే అని అంటాడు. అప్పుడు రామ్మూర్తి దంపతులు ఎలా అయినా ఈరోజు మనవరాలు గేమ్ చూసి నేర్చుకోవాలి అని ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు మాధవ, దేవి ఇద్దరూ గేమ్ ని రసవత్తరంగా ఆడుతూ ఉంటారు. అప్పుడు రామ్మూర్తి దంపతులు రాధ,చిన్మయి ఈ సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉంటారు.
ఇక చివరిలో దేవి గెలిచి మాధవని ఓడించడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు రాధ మరింత సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ గుడిలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆమె భర్త వచ్చి ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో గుడిలో జరిగిన విషయాన్ని చెబుతూ అమ్మవారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అని అంటుంది దేవుడమ్మ.
Devatha july 18 Today Episode :దేవత జూలై 18 ఎపిసోడ్ కోపంతో రగిలిపోతున్న మాధవ..?
ఇందులోనే రాజ్యమ్మ కూడా అక్కడికి వచ్చి రాధ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మరొకవైపు రాధ పిల్లలకు జడ వేస్తాను అని అనగా పిల్లలు మాత్రం వద్దు అంటూ మారం చేస్తూ ఉంటారు. అప్పుడు జానకి జడ వేసుకోండి అని చెప్పగా వెంటనే రామ్మూర్తికి చెప్పి అవ్వకి గుండు కొట్టించు తాత అంటూ కామెడీగా మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు రాధ ఇప్పుడు కనుక జడలు వేయించుకోకపోతే ఇద్దరికీ గుండు కొట్టిస్తాను అని అనడంతో అప్పుడు దేవి, చిన్మయి లు నువ్వంటే నువ్వు అంటూ పోటీ పడుతూ ఉండగా అప్పుడు రాద దేవికి జడ వేస్తుంది జానకి చిన్మయికి జడ వేస్తుంది. రాధ దేవికి జడ వేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు దేవి అమ్మ నన్ను ఆఫీసర్ సారి వాళ్లు చాలా బాగా చూసుకున్నారు.
ఆఫీసర్ సారు అయితే మంచి మంచి మాటలు చెప్పారు అనడంతో రాధ సంతోషిస్తూ ఉండగా మాధవ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు దేవి నేను ఆరోజు తప్పు చేశాను అమ్మ ఆఫీసర్ సారు దత్తత తీసుకుంటా అన్నప్పుడు పోయి ఉంటే బాగుండు అనడంతో రుక్మిణి ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఆ మాటలు విని మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఆదిత్య చెస్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడు రాధ,ఆదిత్య కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు. రాధ మాటలు విన్న మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు రాధ, ఆదిత్యలు మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తారు.
ఆ తరువాత మాధవ, దేవి అన్న మాటల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఎలాఅయినా రాధ,దేవిలను ఇల్లు దాటి వెళ్ళకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాధ,దేవి అక్కడికి వచ్చి చెస్ కాంపిటీషన్ కు వెళ్దాం పద అని అంటారు. ఆ తరువాత రాధ వాళ్ళు చెస్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్లడంతో అక్కడ పాస్ లేకపోవడంతో వారిని లోపలికి వెళ్ళనివ్వరు.
అప్పుడు దేవి టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే ఆదిత్య అక్కడికి వచ్చి రాధ,దేవిలను లోపలికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు మాధవ ఏమి మాట్లాడలేక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత చెస్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలవుతుంది. రాధ,ఆదిత్యలు సంతోషంగా కనిపిస్తూ ఉంటారు.
Read Also : Devatha July 15 Today Episode : మాధవ ఎత్తులకు రుక్కు చెక్.. సత్యముందు దేవిపై మాధవ.. దొంగ ప్రేమ!
Tufan9 Telugu News And Updates Breaking News All over World