The Warrior Movie Review : రామ్ పోతినేని అంటేనే ఊరమాస్.. ఫుల్ ఎనర్జిటిక్ స్టార్.. ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న రామ్.. ఇప్పుడు `ది వారియర్`(The Warrior Movie) మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. పూర్తి యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రామ్ తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ నటించాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి బైలింగ్వల్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు. అందాల భామ ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి రామ్‌కు జోడీగా నటించింది. ఇందులో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశాడు. రామ్, ఆది పినిశెట్టి మధ్య ఫైట్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట.. మొత్తం మీద మూవీ ఎలా ఉంటుందనేది ట్విట్టర్‌లోనే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
`ది వారియర్` మూవీ ట్విట్టర్ టాక్ జోరుగా నడుస్తోంది. ట్విట్టర్‌లో టాక్ ప్రకారం.. సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు. రామ్ తమిళంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ అదిరేలా డైరెక్టర్ లింగుస్వామి `ది వారియర్` స్టోరీని పవర్‌ఫుల్‌గా చూపించాడు. రామ్‌ను మోస్ట్ పవర్ ఫుల్‌గా చూపించాడని చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ సరదాగా సాగుతుందట.. ఇప్పటికే ఇది సూపర్ హిట్ అంటూ టాక్ నడుస్తోంది. సెకండాఫ్ ఊరమాస్‌గా సాగుతుందట.. రామ్ ఎనర్జటిక్ యాక్షన్ సీన్లు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయట. రామ్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించే మూవీగా ట్విట్టర్ నెటిజన్లు చెబుతున్నారు.
రామ్, కృతి డాన్సులు మూవీలో హైలైట్..
సెన్సార్ పూర్తి అయిన ఈ మూవీ U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా నిడివి 155 నిమిషాలుగా ఉంటుంది. ఇక సెన్సార్ రిపోర్ట్ చూస్తే.. సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా అంటున్నారు. రామ్ సినిమా సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. సినిమాలో యాక్షన్ సీన్లు, డ్రామా ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ని కట్టిపడేస్తాయని అంటున్నారు. రామ్ మూవీ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ తన ఊరమాస్‌తో విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. ఇక పాటల విషయానికి వస్తే.. రామ్, కృతి డాన్సులు మూవీలో హైలైట్‌గా నిలుస్తాయి. యాక్షన్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు.
The Warrior Movie Review : ది వారియర్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్ ఫన్నీ.. సెకండాఫ్ ఫుల్ ఊరమాస్..
రామ్, ఆది పినిశెట్టిల మధ్య ఫైట్ సీన్లు అదుర్స్ : రామ్ డీఎస్పీ సత్యగా కనిపిస్తాడు. ఆ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నంతసేపు దుమ్మురేపుడాని టాక్ నడుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో రెండు పాటలుంటాయి.. ప్రతి సీన్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా సాగుతాయని అంటున్నారు. ఇంటర్వెల్‌కి ముందు ట్విస్ట్ ఉంటుంది. అదే సినిమాకు పెద్ద హైలట్ అంటున్నారు. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్ సెకండాఫ్‌లో వస్తాయి.. ఇందులో కామెడీ, ఎంటర్ టైనర్, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. రామ్, ఆది పినిశెట్టిల మధ్య ఫైట్ సీన్లు, హొరాహొరీగా ఉంటాయని ట్విట్టర్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే ది వారియర్ మూవీకి రేటింగ్ కూడా 3 రేటింగ్ పైనే ఇచ్చేస్తున్నారు.
రామ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ ది వారియర్ మూవీని శ్రీశ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. రూ. 43కోట్ల బిజినెస్‌తో ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. గురువారం (జూలై 14) విడుదల అయిన ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఆశించినస్థాయిలో లేదని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే మూవీపై ఎంతవరకు ప్రభావం పడుతుంది అనేది తెలియాల్సి ఉంది. రామ్ ఎంతవరకు సినిమాతో ఆడియోన్స్ ను మెప్పించాడో తెలియాలంటే మూవీ థియేటర్లలో చూడాల్సిందే..
ది వారియర్ మూవీ రివ్యూ :
రేటింగ్ : 3.5/5
Read Also : Sammathame Movie Review : సమ్మతమే మూవీ రివ్యూ & రేటింగ్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world