Kriti Shetty : కృతిశెట్టికి కష్టకాలం.. సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పబోతుందా? ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Kriti Shetty : టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు రావాలంటే ఒక టాలెంట్ మాత్రమే సరిపోదు.. అందుకు అదృష్టం కూడా తోడు ఉండాలి. అలాగే ఎవరైనా గాడ్ ఫాదర్ వంటి వాళ్ల అండ కూడా తప్నక ఉండాల్సిందే. అప్పుడే సినిమాల్లో అవకాశాలు పుష్కలంగా అందుతాయి. కానీ, అన్ని ఉండి టాలెంట్ లేకపోతే మాత్రం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టమే.. ఎందుకంటే.. ఎంతటి పెద్ద హీరో అయినా సినిమా ఎంత భారీ బడ్జెట్ అయినా కంటెంట్ లేకపోతే.. అంతే సంగతులు.. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో వచ్చే హీరోయిన్లు చాలా అరుదు. అందులో తక్కువ మంది మాత్రమే హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

Actress Krithi Shetty Wants Break from Movies for Some Time, Do You Know Why
Actress Krithi Shetty Wants Break from Movies for Some Time, Do You Know Why

అరకోర సినిమాలు చేసిన తర్వాత మళ్లీ కనిపించకుండా పోతున్నారు. చాలామంది హీరోయిన్ల పరిస్థితి ఇలానే ఉంది. అందులో కొంతమంది మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకుని నిలబడుతుంటారు. అలాంటి తక్కువ మంది హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బేబమ్మగా అందరికి దగ్గరయింది. కొద్ది సినిమాలతోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బేబమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

Kriti Shetty : సినిమాలకు బేబమ్మ బ్రేక్..    

చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయింది. ఉప్పెన తర్వాత కృతిశెట్టి నటించిన సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు వరుసగా హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీలు ఫ్లాప్ టాక్ అందుకున్నాయి. ఆ తర్వాత కృతిశెట్టికి సరైన హిట్ పడలేదు. దీని కారణంగా కృతిశెట్టి కెరీర్ కష్టాల్లో పడినట్టే కనిపిస్తోంది. కుర్ర హీరోలు మాత్రమే కృతిశెట్టి వైపు చూస్తున్నారు. తప్ప స్టార్ హీరోలెవ్వరు కూడా బేబమ్మను పట్టించుకోవడం లేదు.

Advertisement
Actress Krithi Shetty Wants Break from Movies for Some Time, Do You Know Why
Actress Krithi Shetty Wants Break from Movies for Some Time, Do You Know Why

అందుకు రెండే రెండు కారణాలు.. అందులో ఒకటి వరుస డిజాస్టర్ సినిమాలు కావడమే.. రెండో కారణం.. కృతిశెట్టి వయస్సు చాలా చిన్నది.. ఆమె వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు 40 ఏళ్ల వయస్సు దగ్గరలో ఉన్నారు. స్టార్ హీరోల పక్కన కృతిశెట్టి హీరోయిన్ చేయాలంటే కష్టమే.. అందుకే స్టార్ హీరోలు ఆమె వైపు చూడటం లేదని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. హీరోయిన్ కెరీర్ ఎదగాలంటే కచ్చితంగా స్టార్ హీరోతో సినిమా చేస్తేనే ఆ క్రేజ్ పెరుగుతుంది.

కానీ, ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కృతిశెట్టి ఒక సంచలన నిర్ణయానికి వచ్చిందట.. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటుందట.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు స్వస్తి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుందంట.. స్టార్ హీరోలతో సినిమాలు వచ్చేంతవరకు ఈ అమ్మడు వేచి ఉండాలనుకుంటందట.. నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న ఒక మూవీలో కృతిశెట్టి నటించనుంది.

Read Also : Yashoda Movie Review : యశోద మూవీ రివ్యూ.. సమంత సినిమా ఎలా ఉందంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel