AP SSC Supplementary Exams 2022 : ఏపీలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు మొదలుకానున్నాయి. జూలై 6 (బుధవారం) నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో (2021-22) పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, బెటర్‌మెంట్ పరీక్షలు జరుగనున్నాయి. జులై 6 నుంచి 15 వరకు ఈ పరీక్షలను ఉదయం 9 గంటల 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు నిర్వహించనున్నారు. దాదాపు 986 పరీక్ష కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు.
దాదాపు 2,01,627 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. అలాగే, 8,609 మంది విద్యార్ధులు బెటర్‌మెంట్ పరీక్షలు రాయనున్నారు. సప్లిమెంటరీకి సంబంధించి 90,334 మంది బాలికలు కానున్నారు. 1,16,826 మంది బాలురు ఉన్నారు.
బెటర్‌మెంట్ రాసేవారిలో బాలురు 4,737 మంది, బాలికలు 3,872 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష సమయం మించితే ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని, హాల్ టికెట్లతో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
Read Also : Goutham Raju : టాలీవుడ్‌లో విషాదం.. సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూత