Goutham Raju : తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతమ్ రాజు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినిమా పరిశ్రమలో 800కు పైగా మూవీలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లోనూ ఎడిటింగ్ చేశారు.
ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, కిక్, రేసుగుర్రం, కాటమరాయుడు, గోపాలగోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్, మిరపకాయ్, కృష్ట, డాన్ శీను, సౌఖ్యం, డిక్టేటర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ మూవీకి బెస్ట్ ఎడిటర్‌గా నంది అవార్డు లభించింది.
68 ఏళ్ల వయసులో ఆయన మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Read Also : Upasana konidela: మెగా వారసుడు వచ్చేస్తున్నాడు..! చెప్పకనే చెప్పేసిన ఉపాసన!