Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Goutham Raju : టాలీవుడ్‌లో విషాదం.. సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత

Goutham Raju : తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతమ్ రాజు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినిమా పరిశ్రమలో 800కు పైగా మూవీలకు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ సినిమాల్లోనూ ఎడిటింగ్ చేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌ సింగ్, కిక్‌, రేసుగుర్రం, కాటమరాయుడు, గోపాలగోపాల, అదుర్స్‌, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, ... Read more

By Vinod Kumar

Published on: July 6, 2022 9:28 AM

Updated on: July 6, 2022 9:28 AM

Film Editor Goutham Raju Passes Away in Telugu News

---Advertisement---

Goutham Raju : తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతమ్ రాజు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినిమా పరిశ్రమలో 800కు పైగా మూవీలకు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ సినిమాల్లోనూ ఎడిటింగ్ చేశారు.

Film Editor Goutham Raju Passes Away in Telugu News
Film Editor Goutham Raju Passes Away in Telugu News

ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌ సింగ్, కిక్‌, రేసుగుర్రం, కాటమరాయుడు, గోపాలగోపాల, అదుర్స్‌, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్‌, మిరపకాయ్‌, కృష్ట, డాన్‌ శీను, సౌఖ్యం, డిక్టేటర్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్‌ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ మూవీకి బెస్ట్ ఎడిటర్‌గా నంది అవార్డు లభించింది.

Advertisement

68 ఏళ్ల వయసులో ఆయన మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Read Also : Upasana konidela: మెగా వారసుడు వచ్చేస్తున్నాడు..! చెప్పకనే చెప్పేసిన ఉపాసన!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.