Nagachaitanya : నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Updated on: June 23, 2022

Nagachaitanya : టాలీవుడ్ క్రేజీ కపుల్ గా నాగచైతన్య సమంత ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కాస్త ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఇది చూసి ఓర్చుకోలేని చైతన్య అభిమానులు సమంత పై దారుణమైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అదే విధంగా నాగచైతన్య మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంతో చనువుగా ఉన్నారని తనతో కలిసి ముంబై వెళ్లడం,తనని తరచు కలుస్తూ ఉండటంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

Nagachaitanya
Nagachaitanya

ఈ వార్తలపై చైతన్య అభిమానులు స్పందిస్తూ నాగచైతన్య పేరును చెడగొట్టడానికి సమంత తన టీంతో కలిసి ఇలాంటి వార్తలు సృష్టిస్తోంది అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేశారు. ఈ విధంగా నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై సమంతను దారుణమైన కామెంట్లు చేయడంతో సమంత ఈ వార్తలపై స్పందిస్తూ అమ్మాయిల గురించి ఇలాంటి వార్తలు వస్తే అమ్మాయిలదే తప్పు.అదే ఒక అబ్బాయి గురించి ఇలాంటి వార్తలు వస్తే అందులో అమ్మాయి ప్రమేయం ఉంటుంది. ఈ సమస్య నుంచి మేం మూవ్ ఆన్ అయ్యాము. మీరు కూడా మూవ్ ఆన్ అయ్యి మీ పనులు మీరు చూసుకోండి మీ కుటుంబం కోసం కష్టపడండి అబ్బాయిలు అంటూ కామెంట్ చేశారు.

సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుంటారు అన్నప్పుడే వీళ్లిద్దరు వెళ్ళిపోతారని అనుకున్నాను. వీరిద్దరికీ ఇండస్ట్రీలో ఎంతో మంచి కెరియర్ ఉంది. సమంత ఎంతో ఫ్రీడం ఉన్న అమ్మాయి. పెళ్లయిన తర్వాత సమంతను సమంతల కాకుండా అక్కినేని కోడలిగా చేశారు. అక్కినేని కోడలిగా ఈమె ఇండస్ట్రీలో ఉండడం అభిమానులు ఒప్పుకోకపోవడంతో విసుగుచెందిన సమంత తన అక్కినేని ట్యాగ్ తొలగించుకొని బయటకు వచ్చింది.ఇక నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై స్పందిస్తూ వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు కానీ
అమ్మాయిలు ఇలా చాలా మంది ట్రాప్ చేస్తారు సుమా అని సమంత హింట్ ఇచ్చారు.

Advertisement

Read Also :  Samantha warning: ఏది పడితే అది మాట్లాడొద్దంటూ సామ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel