Intinti Gruhalashmi june 16 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు లక్కీని తీసుకొని మాల్ కి వెళ్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఫ్యామిలీతో కలిసి లక్కీ ఎంజాయ్ చేస్తూ ఉండగా నందు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒకవేళ లాస్య చూసింది అంటే ఇక అంతే సంగతులు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి తులసి కొడుకులు, కోడలు రావడంతో అందరూ ఒక్కసారిగా సంతోష పడుతూ ఉంటారు.
అనుకోకుండా కుటుంబం అంతా ఒక చోట కలిసినందుకు అందరూ ఆనంద పడుతూ ఉంటారు. వీరందరిని చూస్తే లాస్య కచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది. లాస్య వచ్చేలోపు ఎలా అయిన లక్కీ నీ ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అనుకుంటూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది.
లక్కీ తులసి వాళ్ళతో ఆడుకుంటూ ఉండగా అది చూసిన లాస్య కుంటూ రగిలిపోతుంది. తులసి దగ్గరికి వెళ్లి లక్కీ ని తీసుకుని పక్కకు వెళ్లి పోతుంది. అప్పుడు అనసూయ లాస్య పై మండిపడుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెంటే వస్తున్నారు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదు అంటే ఇదేనేమో అని అంటుంది. అప్పుడు ఎవరిని అంటున్నారు అని లాస్య అడగడంతో పేర్లు ఎందుకులే అమ్మా అంటూ అనసూయ వెటకారం గా మాట్లాడుతుంది. అప్పుడు లాస్య నందు పై విరుచుకుపడుతూ ఉండగా నందు తన తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.
ఇంతలోనే పరంధామయ్య నందు కి గట్టిగా బుద్ధి చెబుతాడు. అప్పుడు తులసి పరంధామయ్య వదిలేయండి మావయ్య ఆనందంగా గడపడానికి వచ్చాను అవన్నీ ఎందుకు అని అంటుంది. ఆ తర్వాత లాస్య, నందు అభి లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మాల్ లో వేరే ప్లేస్ కి వెళ్ళిన లాస్య నందు పై విరుచుకుపడుతూ ఉంటుంది.
అప్పుడు అభి మధ్యలో కలగజేసుకుని ఇందులో డాడ్ తప్పు లేదు మీరు అపార్థం చేసుకుంటున్నారు అని సర్ది చెబుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో నందు అభికి చెక్కు ఇచ్చినట్టుగా ఇచ్చి వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు గాయత్రీ ఐ హేట్ యు అంకిత అని అనగా ఐ హేట్ యు అనే మమ్మీ దగ్గర నేను కూడా ఉండను అని చెప్పి లగేజ్ తీసుకొని తులసి ఇంటికి వెళ్లి పోతుంది. అది చూసి తులసి వాళ్ళు ఒక్క సారిగా షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World