Hyderabad: ఇకపై వాట్సాప్ కే ట్రాఫిక్ చలానా వివరాలు… సరికొత్త ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసులు!

Hyderabad: ట్రాఫిక్ చలానా విషయంలో హైదరాబాద్ పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ సరికొత్త విధానాన్ని అనుసరించన్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు ఒక వాహనానికి సంబంధించిన చలానాను ఇకపై వాట్సాప్ కి పంపించడం వల్ల వాహనదారులు అలర్ట్ అవుతూ ఎలాంటి పెండింగ్ లేకుండా చలానా చెల్లిస్తారు అన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనం వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో మన అన్ని వివరాలతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము కనుక మన ఈ- చలానా వివరాలను ఇకపై మన వాట్సాప్ నెంబర్ కు పంపించనున్నారు.

గతంలో ఇలాంటి చలానా తెలుసుకోవడం కోసం పోలీస్ ఈ చలానా పోర్టలో చెక్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ వివరాలు నేరుగా వాట్సప్ కి రావడంతో చలానాలు పెండింగ్ లేకుండా చెల్లించుకోవచ్చు.ఇలా వాట్సప్ కాకుండా ఈ మెయిల్ ద్వారా కూడా వాహనదారులకు పంపవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఉండదన్న ఉద్దేశంతో ఇలా వాట్సాప్ నెంబర్ కు పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ ఈ-చలాన్ విభాగంలోని పోలీసుల బృందం ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఈ-చలాన్ పోర్టల్‌లో ట్రాఫిక్ జరిమానాలను అప్‌డేట్ చేస్తుంది. అదేవిధంగా యజమానికి మొబైల్ నంబర్ కు ముందుగా చలానా వివరాలను పంపించి అనంతరం పోస్టల్ ద్వారా కూడా పంపించేవారు.ప్రస్తుతం వాట్సాప్ ద్వారా కూడా ఒక వాహనదారుడు వారి వాహనానికి సంబంధించిన చలానా వివరాలను పంపించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని వాహనాలకు పెండింగ్ ఉన్న చలానా చెల్లించడం కోసం వాహనదారులకు పోలీసులు భారీ డిస్కౌంట్ ఇవ్వడం మనం చూస్తున్నాము.

Advertisement