Sri Reddy: తాను చేసిన నల్ల బొక్కల కూర తింటే రాత్రికి మూలగాల్సిందే అంటున్న శ్రీ రెడ్డి..!

Sri Reddy: శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలో తలదూరుస్తూ అటు సినిమా వాళ్ళని ఇటు రాజకీయ నాయకులపై అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తు ఉంటుంది. అటువంటి శ్రీ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎవ్వరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన రూటు మార్చుకుంది.

Advertisement

ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి వంటలక్కగా అవతారం ఎత్తింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కూడ తెలంగాణ స్టైల్ లో బొక్కల కూర వండిన వీడియో ఒకటీ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి తన వంటలతో పాటు తన అందాలను కూడ ప్రేక్షకులకు విందుగా పెట్టింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి తెలంగాణ యాస మాట్లాడుతు పొలంలో ప్రకృతి అందాల నడుమ మేక బొక్కల కూర వండింది. సెలయేరు పక్కన కూర్చుని తాను వండిన కూరని అన్నంలో కలుపుకొని తినింది.

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు శ్రీరెడ్డి అందాలను చూస్తూ.. ఆమె చేసిన వంటకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి తన అందాలతో పాటు తన వంటలతో కూడా అభిమానుల్ని పెంచుకుంటుంది. ఇలా ఇప్పటికే ఆంధ్ర స్టైల్ లో కోడి మాంసం, మేక కూర, చేపల పులుసు వంటి వివిధ రకాల వంటలను తయారు చేసిన శ్రీ రెడ్డి తాజాగా తెలంగాణ వారికి ఎంతో ఇష్టమైన నల్లి బొక్కల కూర చేసి ఆ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఈ విధంగా శ్రీ రెడ్డి ఈ వీడియోలో ఎంతో నాటు గా తయారయ్యి మసాలా కూరచేస్తూ నల్లి బొక్కల కూర తింటే రాత్రంతా మూలుగుడే మూలుగుడు అంటూ బోల్డ్ గా మాట్లాడింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శ్రీరెడ్డి తయారు చేసిన నల్లి బొక్కల కూరను ట్రై చేసి చూడండి.

Advertisement
Advertisement