వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Viral News: బాహుబలి వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి పత్రికలో ఏకంగా 900 కుటుంబాల పేర్లు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Viral News: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో ముఖ్యమైన ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవడం చూస్తూ ఉంటాము. ఇక పెళ్లి పత్రికల నుంచి మొదలుకొని పెళ్లి బట్టలు, నగలు, మండపం వరకు ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఘనంగా ఉండేలా చూసుకుంటాము. ఇక పెళ్లి పత్రికల విషయానికి వస్తే సాధారణంగా కార్యనిర్వాహుల పేర్లు మన దగ్గర కుటుంబ సభ్యుల పేర్లను వేస్తాము. రెండు ... Read more

By Ramesh Babu

Published on: June 25, 2022 10:35 AM

Updated on: June 25, 2022 10:39 AM

---Advertisement---

Viral News: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో ముఖ్యమైన ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవడం చూస్తూ ఉంటాము. ఇక పెళ్లి పత్రికల నుంచి మొదలుకొని పెళ్లి బట్టలు, నగలు, మండపం వరకు ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఘనంగా ఉండేలా చూసుకుంటాము. ఇక పెళ్లి పత్రికల విషయానికి వస్తే సాధారణంగా కార్యనిర్వాహుల పేర్లు మన దగ్గర కుటుంబ సభ్యుల పేర్లను వేస్తాము. రెండు లేదా మూడు కుటుంబాల పేర్లను పెళ్లి పత్రికలో అచ్చు వేయడం మనం చూసాము. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 900 కుటుంబాల పేర్లను పెళ్లి పత్రికలలో వేయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

తమిళనాడులోని తంజావూరు జిల్లా మల్లాపురం గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల పేర్లను తన కూతురు వివాహ పత్రికలో వేయించారు. రమేష్ చుట్టుపక్కల ఐదు గ్రామాలకు ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. ఈయనను రెండుసార్లు పంచాయతీ ఎన్నికలలో గెలిపించడం వల్ల ఆ గ్రామాల ప్రజలు తన కుటుంబ సభ్యులుగా భావించి 900 కుటుంబాల పేర్లను పెళ్లి పత్రికలో వేయించారు.అదే విధంగా ఈ ఐదు గ్రామాలలోని ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా తానే వివాహ పత్రికను అందజేసి తన కూతురి వివాహానికి ఆహ్వానించారు.

ఈ విధంగా రమేష్ అనే వ్యక్తితన కూతురు పెళ్లి కోసం తయారు చేయించిన ఈ బాహుబలి వెడ్డింగ్ కార్డు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.ఇక గ్రామస్తులు సైతం వారి పేర్లు పెళ్లి పత్రికలో ఉండటం వల్ల ఏకంగా తమ ఇంట్లో పెళ్లి జరుగుతుందని భావించి ఆ పెళ్లి పనుల తన భుజాన వేసుకుని ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. రమేష్ కుమార్తె వివాహం శుక్రవారం కుంభకోణంలో పదివేల మంది అతిథుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తానికి పెళ్లి పత్రికలు 900 కుటుంబాల పేర్లను వేయడంతో ఈ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel