Punch prasad: జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Punch prasad: ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా బాగా పెరిగిపోయింది. ఆయా కార్యక్రమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు ంతో ఇంట్రెస్టింగ్ గా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా విడుదలైన ప్రతీ ప్రోమోలో కూడా ఏదో ఒకటి స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక కొన్ని సార్లు ఈ ప్రోమోల్లో కనిపించే సెంటిమెంట్ బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా కార్యక్రమంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇకపోతే ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెంనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో భాగంగా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి ఎమోషనల్ కామెంట్లు చేయడం అందరి కంట కన్నీరు పెట్టించింది. జబర్దస్త్ లో స్పాంటేనియస్ పంచులతో పంచ్ ప్రాసద్ కి ఎంత పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే పంచ్ ప్రసాద్ కి రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయాయి అన్న విషయం కూడా తెలిసిందే. ఆపరేషన్ చేయిస్తే నార్మల్ అవుతాడు అని దీని కోసం కమెడియన్స్ అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చారని అప్పట్లో నాగబాబు చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఆపరేషన్ ఎందుకు కాలేదో అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే మీకు అవసరం అయితే కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ అంటూ ఓ అభిమాని చెప్పగా… ప్రసాద్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. దేవుడు ఛాన్స్ స్తే.. నేను ఇంకొన్నాళ్లు మిమ్మల్ని నవ్విస్తానని చెప్పాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel