AP Crime: ప్రియురాలి కోరికను తీర్చడం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులను బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడో తెలుసా?

Updated on: May 4, 2022

AP Crime: ఈ రోజుల్లో యువతకు ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించడం కన్నా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని అడ్డు దారులలో డబ్బులు సంపాదించడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున భారీ మోసాలకు తెర లేపుతూ ఎంతో మందిని మోసం చేస్తూ లక్షల్లో డబ్బులు పోగు చేసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి విశాఖపట్నం గాజువాక వీధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నం గాజువాకకు చెందిన విష్ణుమూర్తి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. మంచి ఉద్యోగం తెలివితేటలు ఉన్న అతను ఎందరికో ఆదర్శంగా నిలబడ్డాడు. ఇలా జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న విష్ణుమూర్తి ప్రేమలో పడ్డాడు.ప్రియురాలి మోజులో ఆమె అడిగిన కోరికలను తీర్చడం కోసం కష్టపడి పని చేయకుండా ఈజీగా డబ్బులు వచ్చే మార్గాన్ని ఎంచుకుని లక్షల్లో డబ్బులు సంపాదించాడు.ఈ క్రమంలోనే రాజస్థాన్ సీఎం పేరుతో ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫోన్ చేసి వారి నుంచి డబ్బు కావాలని డిమాండ్ చేస్తూ తన అకౌంట్లో డబ్బులు వేయించుకునే వారు. ఈ విధంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆయన మాయలో పడి మోసపోయారు.

తాజాగా విష్ణుమూర్తి ఏప్రిల్ 24న తిజార నియోజకవర్గం ఎమ్మెల్యే సందీప్ యాదవ్ కి ఫోన్ చేసి ఎప్పటిలాగే తన రాజస్థాన్ ముఖ్యమంత్రి అంటూ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగారు.దీంతో అనుమానం వచ్చిన సందీప్ యాదవ్ రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇతని ఆచూకీ కనుక్కొని అసలు విషయం బయట పెట్టారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ పోలీసులు అతనిని ట్రాన్సిట్ వారెంట్ పై రాజస్తాన్ తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో విష్ణు లీలలు బయటపడ్డాయి.విష్ణుమూర్తి ఇప్పటివరకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలకు ఫోన్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టాడు అయితే ఇలాంటి పని చేయడానికి గల కారణం తన ప్రియురాలు అని తన కోరికలు తీర్చడం కోసమే తాను ఇలాంటి పనులు చేస్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే తన ప్రియురాలు కోరిక మేరకు తనకు ఏకంగా 80 లక్షల విలువచేసే ఇంటిని విష్ణుమూర్తి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel