Hyderabad: పది రూపాయలు ఇస్తే చాలు ఆ కేసులన్నీ మాఫీ.. హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్?

Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ పోలీసులు అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చారు.గత నెలలో వాహనదారులకు విధించిన ట్రాఫిక్ చలానాలను క్లియరెన్స్ చేయడం కోసం వాహనదారులకు అద్భుతమైన రాయితీ ప్రకటించిన ట్రాఫిక్ పోలీసుల బాటలోనే నగర పోలీసులు కూడా మరొక ఆఫర్ ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ ను నియంత్రణ చేయడం కోసం ఎన్నో ట్రాఫిక్ చలానాలు విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది వాహనదారులపై కేసులు ఉన్నాయి.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(Disaster Management) కింద అధికారులు అంటే వేర్వేరు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసులో ఉన్న బాధితులకు నగర పోలీసులు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో సుమారు ఒక వాహనదారునిపై సుమారు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించారు. అయితే ఈ జరిమాన పెండింగ్ ఉన్న వారికి నగర పోలీసులు ఒక అవకాశం కల్పించారు.

ఇలా ఎవరికైతే కేసులు ఉన్నాయో అలాంటి వారు కేవలం పది రూపాయలు చెల్లిస్తే చాలు వారిపై ఉన్న కేసును కొట్టి వేస్తామని వాహనదారులకు అవకాశం కల్పించారు.అయితే ఈ 10 రూపాయలు చెల్లించి తమ పై ఉన్న కేసులు కొట్టివేయడానికి కూడా నిర్ణీత గడువు కేటాయించారు. ఈ ఆఫర్ మే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మాత్రమే. ఈ క్రమంలోనే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాహనదారులకు నగర పోలీసులు సూచించారు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel