Makeover Tips: టైం పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేసింది.. చివరికి ఉద్యోగం మానేసి అలా!

Makeover Tips:ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన అమ్మాయిలు ఎంతో అందంగా కనపడాలని, డ్రెస్ నుంచి మొదలుకొని నగలు లిప్ స్టిక్ వరకు ప్రతి ఒక్కటి కరెక్ట్ మ్యాచ్ తెచ్చుకొని ఎంతో అందంగా ముస్తాబవుతూ ఉంటారు.ఇంకా ఏదైనా పెళ్లిళ్లు పెద్ద ఫంక్షన్లు జరిగితే తప్పనిసరిగా చాలామంది మేకప్ ఆర్టిస్టులను పిలిపించుకొని అందంగా తయారు అవుతూ ఉంటారు. అందుకే ప్రస్తుతం బ్యూటీ కోర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నటువంటి విమలా రెడ్డి హైదరాబాద్ లో నివసిస్తున్నారు.ఎనిమిది సంవత్సరాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఈమె పెళ్లి తర్వాత ఆరు నెలల పాటు ఇంటికి పరిమితం కావలసి వచ్చింది.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇలా ఇంటిపట్టున ఉండటం వల్ల తనకు ఏ మాత్రం దిక్కుతోచలేదు. ఇదే సమయంలో పేపర్ లో బ్యూటీ కోర్స్ ప్రకటన చూసి టైం పాస్ కోసం ఆ కోర్సులో చేరింది. ఈ విధంగా కోర్స్ చేసిన తర్వాత అనంతరం తన ఉద్యోగంలో చేరి తన విధులను నిర్వహిస్తోంది. అయితే ఒకరోజు బ్యూటీ కోర్సులో శిక్షణ తీసుకున్న తన స్నేహితురాలు ఒక పెళ్లి కోసం తనని సహాయంగా పిలిచారు.ఈ విధంగా తన స్నేహితురాలికి సహాయం చేయడానికి వెళ్లిన విమలా రెడ్డి కేవలం రెండున్నర గంటలలోనే ఆరు వేల రూపాయలు సంపాదించారు.

Advertisement

ఇలా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడంతో విమల రెడ్డి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఫంక్షన్లకు మేకప్ చేయడానికి వెళ్లేవారు. ఇలా కొద్దిరోజుల తర్వాత తన ఉద్యోగం మానేసి పూర్తిగా మేకప్ ఆర్టిస్ట్ గా స్థిరపడి లక్షల్లో సంపాదిస్తున్నారు.ఇటీవల ఈమె ‘గ్రే’ తెలుగు మూవీకి మేకప్‌ ఆర్టిస్ట్‌గానూ చేశాను. 2019లో మేకప్‌ కాంపిటీషన్‌లో పాల్గొని, గెలుపొందాను. అలాగే, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్స్‌కి సంబంధించిన తరగతులను కూడా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.

DIY Charcoal Shoe Polish _ Make Market-Quality Polish at Home
Shoe Polish : ఇంట్లోనే బొగ్గుతో మార్కెట్ లాంటి షూ పాలిష్.. మీ బూట్లు రోజంతా కొత్తగా మెరుస్తూనే ఉంటాయి.. ఇలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు!

ఈ క్రమంలోనే ఈమె కొన్ని బ్యూటీ టిప్స్ కూడా వెల్లడించారు. అందంగా కనిపించాలంటే మాంసాహారం తగ్గించడంతో పాటు ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్, సలాడ్ తీసుకోవాలని తెలిపారు. లేట్ నైట్ ఆహారం తినడం మంచిది కాదు. ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉన్నవారు పూర్తిగా వాటిని మానేయటం మంచిది.నెలకు ఒకసారి రెడీ మేడ్‌ మాస్క్‌ అయినా వేసుకోమని విమలా రెడ్డి సూచించారు.మన ఆరోగ్యం బాగుంటేనే మన చర్మం జుట్టు కూడా ఎంతో అందంగా కనబడుతుందని విమలా రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement
Indian Railways
Indian Railways : రైల్లో ఈ 7 వస్తువులను పొరపాటున ఎప్పుడూ తీసుకెళ్లొద్దు.. లేదంటే జరిమానా, జైలుశిక్ష తప్పదు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel