Prashant Kishor: ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. బీహార్ నుంచి మొదలుకానున్న రాజకీయ ప్రస్థానం!

Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత దశాబ్ద కాలం నుంచి రాజకీయాలలో ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా వేదికగా
పదేళ్ల రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం అంటూ చేసిన పోస్ట్ అందరిలోనూ పలు అనుమానాలకు కారణం అయింది. ఇలాంటి పోస్ట్ చేయడంతో ప్రశాంత్ కిషోర్ స్వయంగా రాజకీయాలలో సొంత పార్టీ ద్వారా ప్రజలలోకి రానున్నారనే సందేహం నెలకొంది.ఈ క్రమంలోనే అందరూ ఊహించిన విధంగా ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీని స్థాపించి రాజకీయాలలోకి ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ తన పార్టీకి ఇక నుంచి జన్‌ సురాజ్‌( ప్రజలకు సుపరిపాలన) పేరుతో పార్టీని ప్రకటించారు. తన పార్టీ ద్వారా ప్రజలకు సేవచేయడానికి ప్రశాంత్ కిషోర్ రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచి మొదలు పెడుతున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. రాజకీయ వ్యూహకర్తగా బీహార్‌లో నితీశ్‌కుమార్‌ను గద్దె ఎక్కించడంలో కీలక పాత్రవహించిన ప్రశాంత్ నేడు అక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.

ఇక ఈయన పార్టీ స్థాపించడానికి ముందు కాంగ్రెస్ తో చేతులు కలుపుతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చివరికి కీలక పదవి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విముఖత ఏర్పడటంతో,ఎలాంటి ప్రాధాన్యత లేని పదవి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఆఫర్ చేయడంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకుండా,స్వయంగా తానే ఒక పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు. ఈయన స్వయంగా పార్టీని స్థాపించడంతో పూర్తిగా రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel