Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

రైతు బాంధవుడు కేసీఆర్.. సంబరాల్లో రైతులు..!

తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు కొనసాగుతున్నాయి. 64 లక్షల మంది అన్నదాతలకు 50 వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతు బంధు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలను కొనసాగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో చేరడంతో తెలంగాణలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు కేటీఆర్. రైతు బంధు ... Read more

By Ramesh Babu

Published on: January 11, 2022 7:00 PM

Updated on: January 11, 2022 5:08 PM

---Advertisement---

తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు కొనసాగుతున్నాయి. 64 లక్షల మంది అన్నదాతలకు 50 వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతు బంధు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలను కొనసాగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో చేరడంతో తెలంగాణలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు కేటీఆర్. రైతు బంధు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు.

ఈ పథకం కింద 64 లక్షల మందికి 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు ముక్కోటి ధాన్యాలు పండిస్తున్న రాష్ట్రం కూడా అని అన్నారు. రైతుబంధు సంబరాల్లో బిజెపి, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు కేటీఆర్. కొంత మంది పొలిటికల్ టూరిస్టులు ఏవేవో మాట్లాడుతున్నారని, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు కూడా సాయం అందుతోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకం ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్.

సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతుల పై ప్రేమ ఉంది కాబట్టే రైతుబంధు అందిస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. బిజెపికి అన్నదాతల పై ప్రేమ ఉంటే దేశమంతటా రైతు బంధు అమలు చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో రైతుబంధు వేడుకలను వినూత్నంగా జరుపుతున్నారు టిఆర్ఎస్ నేతలు. వరి నారు తో కేసీఆర్, కేటీఆర్ చిత్ర పటాలను తయారు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలతో హోరెత్తించారు.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!