Corona Virus: భారత్ లో కొత్తగా 3324 నమోదైన పాజిటివ్ కేసులు..40 మంది మృతి.. హెచ్చరికలు జారీ చేస్తున్న నిపుణులు!

Corona Virus: కరోనా మహమ్మారి గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నింటిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే గత మూడు వారాల నుంచి ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలో కొత్తగా 3324 పాజిటివ్ కేసులు నమోదు కాగా 40 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూదేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే మరణాల రేటు స్వల్పంగా తగ్గినప్పటికీ మూడు వేలకు పైగా కేసులు నమోదు కావడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

గడిచిన 24గంటల్లో కొవిడ్ నుంచి 2,876 మంది కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 19,092కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా శనివారం ఒక్క రోజే 25,95,267 మందికి వైద్యసిబ్బంది టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,89,17,69,346 కుచేరింది.

Advertisement

కరోనా 4వ దశ ప్రతి ఒక్కరిలో తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో నిపుణులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకురావాలని అలాగే ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి అనుమతి తెలపాలని సూచించారు. ఏ ప్రయాణికుడిలో అయినా కరోనా లక్షణాలు కనబడితే వెంటనే వారిని విమానాశ్రయంలోని పరీక్షల ల్యాబ్ కి తరలించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.అదే విధంగా దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచి పలు ఆంక్షలను అమలు చేస్తోంది.

Advertisement