September 29, 2024

Google Search: గూగుల్ సెర్చ్ లో మీ ఫోన్ నెంబర్ ఉందా… అయితే ఫోన్ నెంబర్ ఈజీగా తొలగించుకోవచ్చు?

1 min read
QNALCtok

Google Search: గూగుల్ ద్వారా మనకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా గూగుల్ ఎన్నో మంచి పనులకు ఉపయోగపడగా కొందరు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని పెద్దఎత్తున నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకొని వినియోగదారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు. ఇలా రోజురోజుకు సైబర్ నేరగాళ్లకి ఎంతో మంది బలయ్యారు.ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ నుంచి తమ వ్యక్తిగత వివరాలను తొలగించాలని ఎంతో మంది వినియోగదారులు విజ్ఞప్తి చేశారు.

QNALCtok 1

ఈ క్రమంలోనే గూగుల్ ఇప్పటికే గూగుల్ సెర్చ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చిరునామా, బ్యాంక్ అకౌంట్,క్రెడిట్ కార్డ్ వంటి వివరాలను తొలగించాలని ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి.ఈ క్రమంలోనే విజ్ఞప్తుల కోరిక మేరకు ఒక వ్యక్తి తన వ్యక్తిగత చిరునామా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి వివరాలను గూగుల్ సెర్చ్ తొలగించింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యక్తిగత ఫోన్ నెంబర్ కూడా గూగుల్ సెర్చ్ లో ఉంటే తొలగించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఈ విధంగా యూజర్ల మొర ఆలకించిన గూగుల్ ఇకపై వారి వ్యక్తిగత చిరునామాలను గూగుల్ సెర్చ్ నుంచి తొలగించడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే గూగుల్ తన వ్యక్తిగత వివరాలను తొలగించుకోవడం కోసం గూగుల్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తన బ్లాగ్ స్పాట్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలోని యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్లు తొలగించాలని విన్నపం రావడం చేత ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు గూగుల్ గ్లోబల్ పాలసీ హెడ్ మిచెల్లీ చాంగ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఇలా ఒక వ్యక్తి వ్యక్తిగత వివరాలు గూగుల్ సెర్చ్ లో ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి వెసులుబాటు కల్పించిన గూగుల్ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు ప్రైవేట్ వెబ్ సైట్ లో ఉంటే మాత్రం వాటిని గూగుల్ తొలగించడానికి స్పష్టం చేసింది.కనుక మీ ఫోన్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తిగత వెబ్సైట్ నుంచి మీ వివరాలను తొలగించాలని కోరడం ఎంతో మంచిది.