...

Devatha: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. ఎమోషనల్ అవుతున్న రాధ..?

Devatha: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో ఎలా అయినా రాధ ఇంటి గడప దాటకుండా చూడాలి అనే మాధవ ప్లాన్ చేస్తూ ఉంటాడు.

Advertisement

ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా మాధవ, రాధా నిద్ర పోతూ ఉండగా రాధ గది దగ్గరికి వెళ్లి తలుపు తెరిచి చూస్తూ ఉండగా ఇంతలో రాధకు మెలుకువ వస్తుంది. వెంటనే రాధను చూసిన మాధవ అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉండగా రాధా వచ్చి ఎందుకు సారు అలా చూస్తున్నారు అని గట్టిగా నిలదీస్తుంది.

Advertisement

Advertisement

అప్పుడు మాధవ పిల్లలను చూడాలనిపించింది అంటూ అబద్ధం చెబుతాడు. కానీ రాధ మాత్రం అది అబద్ధం అని మీలో ఏదో మార్పు వచ్చింది మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు అంటూ గట్టిగా నిలదీయడంతో నా పిల్లలను దూరం చేసుకోను, నా రాధ ను కూడా దూరం చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవ.

Advertisement

ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి పిల్లల్ని చూడగా పక్కన దేవి కనిపించదు. దీంతో కంగారుపడిన రాధ ఇల్లు మొత్తం వెతుకుతుంది. వెంటనే రామ్మూర్తి జానకి లకు దేవమ్మ కనిపించడం లేదు అని చెప్పడంతో వాళ్లు కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత చిన్మయి దగ్గకు వెళ్ళి దేవి ఎక్కడికి వెళ్ళింది అని అనడంతో చిన్మయి నాకు తెలీయదు అని అంటుంది.

Advertisement

ఆ తర్వాత మొత్తం అందరూ కలిసి ఊరు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మాధవ కూడా వెతుకుతూ ఉండగా ఇంతలో ఆదిత్య కనిపిస్తాడు. అప్పుడు మాధవ ఆదిత్య కాలర్ పట్టుకుని దేవిని ఎక్కడ దాచావు అని అడుగుతూ ఉండగా ఇంతలో అటుగా వచ్చిన రాధా వారిని చూసి షాక్ అవుతుంది.

Advertisement

ఇద్దరూ ఒకరి కాలర్ పట్టుకొని ఉండగా విడువుండ్రి అని గట్టిగా అరుస్తుంది. ఇక దేవి కనిపించకపోవడంతో మాధవ,ఆదిత్య పై నిందలు వేస్తాడు. ఇక దేవి కనిపించలేదు అని తెలిసే సరికి ఆదిత్య షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆదిత్య, రాధా ఇద్దరు కలసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళతారు. ఇక వారిద్దరూ వెళ్ళడం చూసిన మాధవ కుమిలిపోతూ ఉంటాడు.

Advertisement

ఆ తర్వాత కారులో వెళుతూ ఆదిత్య మాధవ అన్న మాటలకు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రోడ్డుపై ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళుతూ ఉండగా రాధా ఆ అమ్మాయి దేవి అనుకుని దగ్గరికి వెళ్లి చూసే సరికి అక్కడ వేరే అమ్మాయి ఉంటుంది. రాధ,దేవిని తలుచుకొని ఏడుస్తూ ఉండగా ఇంతలో ఒక కారు వేగంగా వచ్చి రాధ ను డీకొట్టబోతుంది. అది చూసిన ఆదిత్య వెంటనే వెళ్లి ఆదిత్య వెంటనే రాధను కాపాడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement