...

Big Boss Nonstop: బిగ్ బాస్ లో మొదలు కాబోతున్న ఫ్యామిలీ ఎపిసోడ్.. హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న షన్ముఖ్..!

Big Boss Nonstop: మునుపటి సీజన్లలాగే ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఓటిటి లో 24/7 ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికీ 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలో అడుగుపెట్టింది.అయితే అన్ని సీజన్లలోలాగే ఈ సీజన్లో కూడా ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ జరగనుంది. కామెడీ ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లా కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వస్తారు . బిగ్ బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంటే అది ఫ్రీ ఫైనల్ గా భావించవచ్చు.

Advertisement

Advertisement

ఇదివరకు జరిగిన బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో కామెడీ ఎపిసోడ్ లో భాగంగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సిరి, షన్ముఖ్ గురించి బయట ప్రజలు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పకనే చెప్పారు. అలాగే సన్ని కి ఉన్న ఫోలోయింగ్ గురించి కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ ద్వారా సన్నీ కి తెలిసింది.

Advertisement

ఫ్యామిలీ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వారు చెప్పే జాగ్రత్తల ఆధారంగా ఇప్పటినుండి గేమ్ తీరు మారిపోతుంది. ఈ వారం హౌస్ లో ఉన్న నటరాజ్ మాస్టర్ కోసం ఆయన భార్య, అరియాన కోసం అవినాష్, మిత్ర కోసం ఆమె ఫ్రెండ్, హమీద కోసం శ్రీ రామచంద్ర, ఆషూ కోసం జెస్సీ, అఖిల్ కోసం సోహెల్, శివ కోసం షన్ముఖ్ రానున్నట్టు సమాచారం. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ ఇప్పటికే బిందు మాధవిని సేవ్ చేశాడు. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ లో బిందు మాధవి కోసం ఎవరు రాబోతున్నారు అన్న విషయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. బిందు మాధవి కోసం ఎవరు వస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement