వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Big Boss Nonstop: బిగ్ బాస్ లో మొదటిసారిగా ఆషురెడ్డికి వింత పనిష్మెంట్ ఇచ్చిన నాగార్జున.. ఏం జరిగిందంటే?

Big Boss Nonstop: బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షో లలో బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఐదో సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ ఓటిటి లో నాన్ స్టాప్ గా ప్రసారమవుతుంది. 17 మంది కంటెస్టెంట్ లతో 8 వారాల క్రితం మొదలైన ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ప్రతి వారం హౌస్ నుండి ఎవరో ఒకరు ... Read more

By Ramesh Babu

Published on: April 27, 2022 3:55 PM

Updated on: April 27, 2022 3:55 PM

---Advertisement---

Big Boss Nonstop: బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షో లలో బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఐదో సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ ఓటిటి లో నాన్ స్టాప్ గా ప్రసారమవుతుంది. 17 మంది కంటెస్టెంట్ లతో 8 వారాల క్రితం మొదలైన ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ప్రతి వారం హౌస్ నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ ఇప్పటివరకు ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.పోయిన వారం బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీదారులను ఎన్నుకోవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు.

‘ హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్’ అనే ఈ టాస్క్ లో పాల్గొనటానికి ఒక అర్హత ఉండాలని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్ లో భాగంగా బాబా భాస్కర్ మాస్టర్ సంచాలకుడిగా వ్యవహరించారు.అఖిల్, శివ, అషు, అనిల్, మిత్రాలు హ్యూమన్ టీం లో ఉండగా మిగిలిన వారు ఏలియన్స్ టీం లో ఉన్నారు. ఈ టాస్క్ లో భాగంగా హ్యూమన్ టీం లో ఉన్నవారు ఏలియన్స్ దగ్గర ఉన్న కుండలను దొంగలించాలి. అలాగే ఏలియన్స్ టీమ్ లో ఉన్నవారు హ్యూమన్స్ టీమ్ లో ఉన్న వారి అరచేతులకు రంగు పోయాలి.

టాస్క్ లో భాగంగా మిత్రశర్మ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా ఆషూ రెడ్డి రంగు పుయటానికి నీళ్లు చల్లింది. ఆషురెడ్డి చేసిన పనికి బిగ్ బాస్ కోపం తో మునుపెన్నడూ బిగ్ బాస్ లో ఇవ్వని పనిష్మెంట్ ఇచ్చాడు. ఆషు నీళ్లు చల్లడం తో మైక్ లు తడిచి పోవటం వల్ల ఒక రోజంతా ఆషురెడ్డి ని మైక్ లేకుండా ఉండమని పనిష్మెంట్ ఇచ్చాడు. మైక్ లేకపోతే బిగ్ బాస్ హౌజ్ లో ఏమి మాట్లాడకూడదు. బిగ్బాస్ ఇలా పనిష్మెంట్ ఇవ్వటంతో ఆషూ కొంత సమయం ఏమీ మాట్లాడకుండా ఉంది. దీంతో బిగ్ బాస్ ఇంకోసారి ఇలా జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చి మైక్ తిరిగి ఇచ్చాడు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel