Karthika Deepam April 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ ని సౌర్య అసహ్యించుకున్నట్లు హిమ కలగంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్, హిమ కలిసి కాఫీ షాప్ కి వెళ్తారు. అప్పుడు హిమ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావ అని అనగా అప్పుడు ప్రేమ్ నాకోసం కొంచెం టైమ్ కూడా స్పెండ్ చేయలేవా హిమ అని అడుగుతాడు. మరొకవైపు వాకింగ్ కోసం అని పార్క్ కీ వెళ్లిన సౌందర్య ఆనందరావు లు ఇంటికి వెళ్ళడం కోసం సౌర్య ఆటో దగ్గరకు వస్తారు. ఇక వారిద్దరిని చూసిన సౌర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అప్పుడు సౌందర్య, సౌర్య ని చూసి స్వారీ చెబుతుంది. అప్పుడు సౌర్య అవేమి పట్టించుకోకుండా కాస్త పొగరుగా మాట్లాడుతుంది. సౌందర్యని సీనియర్ సిటిజన్ అని పిలవగా అప్పుడు ఆనందరావు ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆటోలో వెళుతూ ఆనందరావు ని హిమ గురించి అడిగే ప్రయత్నాలు చేస్తూ పెళ్లి అయిందో లేదో అని తెలుసుకుంటుంది.
ప్రేమ్, హిమ లు కాఫీ షాప్ లో మాట్లాడుతూ ఉంటారు. అప్పడు ప్రేమ్ వెళ్ళి కాఫీ కప్ లో లవ్ సింబల్ వచ్చేలా తీసుకురా అని ఆర్డర్ చేస్తాడు. నిరూపమ్ జ్వాలా కీ ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో జ్వాలా అక్కడికి వెళ్తుంది. ఒక ముసలామెకు మందులు కొనడానికి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి అందుకే నేను ఇస్తున్నాను అని చెప్పి నిరూపమ్ జ్వాలా కీ డబ్బులు ఇస్తాడు.
ఆ తర్వాత జ్వాల నిరూపమ్ తనకి ఆటో కొన్నిచ్చినందుకు మంత్లీ పేమెంట్ అని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత నిరూపమ్ నీ మనసు నాకు తెలుసు నా మనసు నీకు తెలుసు అని అనడంతో ఆ మాటలు మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది జ్వాల. మరొకవైపు సౌందర్య సౌర్య చిన్నప్పటి ఫోటో ని తీసుకెళ్లి మామనవరాలు చిన్నప్పుడు తప్పిపోయింది ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక బొమ్మ గీయాలి అని అడుగుతుంది.
ఇంతలో జ్వాలా అక్కడికి వచ్చి సౌందర్య అక్కడికి ఎందుకు వచ్చిందో అడుగుతుంది. అసలు విషయం తెలుసుకున్న సౌర్య,హిమ దగ్గరికి వెళ్ళినా శత్రువు బొమ్మ కూడా గీయించాలి అని అనడంతో హిమ ఒక్క సారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Karthika Deepam March 7th Today Episode : చివరి రోజు అన్న కార్తీక్ .. బోరున ఏడ్చేసిన సౌందర్య..?
- Karthika Deepam january 06 Today Episode : మోనితని చంపేస్తానని బెదిరించిన కార్తీక్.. మోనితపై సీరియస్ అయిన దీప?
- Karthika Deepam Aug 27 Today Episode : మోనిత నిజ స్వరూపం తెలుసుకున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న దీప..?













