October 5, 2024

New rule for bikers: బైకుపై వెనక సీట్లో పురుషులు కూర్చోవద్దట.. ఎక్కడో తెలుసా?

men do not sit in the back seat of bike at palakkad

ద్విచక్ర వాహనంపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఎవరైనా అలా కూర్చొని వెల్తే కఛినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఘటన కేరళలోని పాలక్కడ్ లో చోటు చేసుకుంది. ఓ ఆర్​ఎస్ఎస్ వర్కర్​ను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యకు.. బైకుపై వెనుక సీట్లో పురుషులు కూర్చోవడాన్ని నిషేధించడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

men do not sit in the back seat of bike at palakkad

ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ షాప్​కు టూవీలర్​పై ఇద్దరు వ్యక్తులు వచ్చి.. పట్టపగలే అతడిని హత్య చేశారు. ఏప్రిల్ 15న ఎస్​డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగా ఈ దారుణం​ జరిగినట్లు తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో జంట హత్యలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని భావించిన అడిషన్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయి.