...
Telugu NewsCrimeVishwa Deendayalan Died : రోడ్డు ప్రమాదంలో యువ టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ మృతి..!

Vishwa Deendayalan Died : రోడ్డు ప్రమాదంలో యువ టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ మృతి..!

Vishwa Deendayalan Died : తమిళనాడుకు చెందిన ఓ యువ క్రీడాకారుడు దీనదయాలన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతడు ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో పాల్గొని విజేతగా తిరిగి రావాలని వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని టెబుల్ టెన్నిస్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా తెలిపింది. ఈరోజు అంటే ఏప్రిల్ 18 సోమవారం 83వ సీనియర్​ నేషనల్​ అండ్​ ఇంటర్​ స్టేట్​ టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏప్రిల్​ 17న విశ్వ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు ట్యాక్సీలో గువాహటి నుంచి షిల్లాంగ్​కు బయలుదేరారు.

Advertisement
Vishwa Deendayalan Died
Vishwa Deendayalan Died

ఈ క్రమంలోనే ఎన్​హెచ్​ 6పై ప్రయాణిస్తుండగా షాంగ్​బంగ్లా వద్ద ఎదురుగా వచ్చిన ఓ ట్రక్​ అదుపుతప్పి.. ఈ ప్లేయర్స్​ ప్రయాణిస్తున్న ట్యాక్సీపైకి దూసుకొచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్యాక్సీ డ్రైవర్​, విశ్వ అక్కడికక్కడే కన్నుమూయగా.. రమేశ్ సంతోశ్​ కుమార్​, అభినాష్​ ప్రసన్నాజీ, కిషోర్​ కుమార్​కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలువురు క్రీడా ప్రముఖులు సహా మేఘాలయ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విశ్వ మరణం తనను తీవ్ర బాధకు గురి చేసిందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మ ట్వీట్​ చేశారు.

Advertisement

Read Also : Bride Dance : పెళ్లి వేదికపైనే తీన్ మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన కొత్త జంట.. ఇదే ట్రెండ్ గురూ.. వైరల్ వీడియో..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు