Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ని తలచుకుంటూ సార్ ఎంత మంచివాడు అని మనసులో పొగుడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి నిర్ణయం గురించి ఆలోచన గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు రిషి నువ్వు ఇకపై ఇంట్లో ఒక్కదానివే ఉంటావు కదా దాని గురించి నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఆ మాటకు వసు అలవాటు అయిపోయింది సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరొకవైపు జగతి, ధరణి లు కాలేజీకి లంచ్ బాక్స్ తీసుకెళ్లడానికి సర్దుతూ ఉంటారు. అప్పుడు జగతి, ధరణికి మంచి మాటలు చెబుతూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏంటి జగతి పొద్దున్నే నీ పాటాలు ధరణి కి కాదు కాలేజీలో చెప్పుకో అని అనడంతో అప్పుడు జగతి ఇంటి పనుల విషయంలో కలుగ చేసుకోవద్దు అని చెబుతుంది.
ఆ మాటకు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు కాలేజీలో జగతి అన్న తీసుకువచ్చిన లంచ్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఇంతలో అక్కడికి రిషి వచ్చి మీరందరూ తినండి నేను లేటుగా తింటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత భోజనం సమయానికి దేవయాని రిషి కి ఫోన్ చేసి తిన్నారా లేదా అని ఇండైరెక్టుగా అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు నేను తినలేదు పెద్దమ్మ అని అనడంతో దేవయాని సంతోష పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్ ఏంటి పెద్దమ్మ ఒకటే నవ్వుతున్నారు ఆ జోక్ చెబితే నేను నవ్వుతాను కదా అని అంటాడు.
మరొక వైపు రిసీ, వసు దగ్గరికి వెళ్లి లంచ్ చేద్దాం పద అని అనడంతో, అప్పుడు వసు భారీగా డైలాగులు చెబుతుంది. అప్పుడు రిషి కామెడీగా లంచ్ త్వరగా తిన నందుకు నేను ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతే నేమో అని అంటాడు. ఆ తర్వాత వసు, రిషి ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. అక్కడ రిషి తన మనసులోని మాటలు వసు కి చెప్పడంతో చాటుగా వింటున్న జగతి దంపతులు ఎంతో ఆనంద పడతారు.