RRR Upasana : ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బొమ్మ పడగానే అభిమానుల రచ్చ మొదలైంది. జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలు సహా మూవీ చూసిన ప్రతిఒక్కరూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.
అందులోనూ రామ్ చరణ్ మూవీ కావడంతో మెగా ఫ్యామిలీ ఎంజాయ్ మెంట్ మాములుగా లేదు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు మెగా ఫ్యామిలీలోనూ అదే జోరు కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్, రాజమౌళి భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల మధ్య మూవీ చూశారు.

బెనిఫిట్ షో మూడు గంటలకే మొదలు కావడంతో అభిమానులంతా ఆసక్తిగా చూశారు. అయితే రాజమౌళి, రామ్ చరణ్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే అభిమానుల్లో కోలాహలం మొదలైంది. ఆర్ఆర్ఆర్ రసవత్తరమైన సీన్ల సమయంలో పేపర్లను విసిరేస్తూ హంగామా చేశారు.
#RRRreview #RRR @upasanakonidela #RamCharan https://t.co/tYcRBV8FnX
— Chantisiri (@Chantisiri7) March 25, 2022
చరణ్ అభిమానులతో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా ఆర్ఆర్ఆర్ మూవీ చూసింది.. రామరాజుగా చరణ్ కనిపించగానే ఉపాసన ఆనందానికి అవధుల్లేవు.. చెర్రీ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ఉపాసన ఫిదా అయిపోయింది. అంతే.. సంతోషం పట్టలేక.. సీట్లో కూర్చొని పేపర్లను పైకి విసరుతూ తెగ ఎంజాయ్ చేసింది ఉపాసన.. ఉపాసన ఆర్ఆర్ ఆర్ థియేటర్లో ఉపాసన రచ్చ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Jr NTR Reaction : RRR మూవీ చూశాక తారక్ రియాక్షన్ చూశారా? వీడియో వైరల్!