...
Telugu NewsDevotionalDevotional Tips : చనిపోయిన వారి ఫోటోలు దేవుని గదిలో పెట్టి పూజిస్తున్నారా... ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips : చనిపోయిన వారి ఫోటోలు దేవుని గదిలో పెట్టి పూజిస్తున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతగానో అభిమానించే ప్రేమించేవారు చనిపోతే ఆ బాధ నుంచి బయట పడటం ఎంతో కష్టమవుతుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని కూడా ఎంతో అపురూపంగా చేసుకుంటాము.ఇలా తనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారిని దైవ సమానులుగా భావించి వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజలు చేస్తుంటారు. నిజంగా ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజించవచ్చా? ఇలా పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

Advertisement

మన కుటుంబంలో మనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. చనిపోయిన వారిని దైవ సమానులుగా ఎప్పుడు భావించకూడదు.అందుకే వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి దేవుడితో సమానంగా పూజలు చేయకూడదు.ఇలా చేయటం వల్ల ఆ భగవంతుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టి పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఇబ్బందులు మానసిక అశాంతి కలుగుతుంది.

Advertisement

చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో లివింగ్ రూమ్ లో పెట్టాలి. అది కూడా ఈ ఫోటోలను ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశ వైపు వేలాడదీస్తూ వారు ఉత్తర దిశవైపు చూసే విధంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయి మనం అనుకున్న పనులు తొందరగా నెరవేరతాయి. అంతేకాని చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు కూడా దేవుడు గదిలో పెట్టకూడదు.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు