Big Boss Non Stop Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్… విన్నర్ ఎవరంటే?

Updated on: March 15, 2022

Big Boss Non Stop Telugu : నోకామా, నో పులిస్టాప్ అంటూ 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.17 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకొని ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగింది. ఈ వారం ఏకంగా 12 మంది నామినేషన్ లో ఉన్నారు.

Big Boss Non Stop Telugu
Big Boss Non Stop Telugu

ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమం గురించి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశారు. సోషల్ మీడియా వేదికగా కౌశల్ స్పందిస్తూ… బిగ్ బాస్ నాన్ స్టాప్ కొన్ని ప్రోమోలను చూశాను. అందులో బిందుమాధవి యాటిట్యూడ్ తన సామర్థ్యాలు తనని విజేతగా నిలబెడతాయని, ఇప్పటికీ కొంతమంది బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాస్క్ అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజన్ అవ్వడం చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ కౌశల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బిగ్ బాస్ కార్యక్రమంలో విజేతగా ఎవరు నిలబడతారనే విషయాన్ని తెలియజేశారు.

అయితే గతంలో సీజన్ ఫైవ్ లో కూడా బిగ్ బాస్ విన్నర్ గా సన్నీ నిలుస్తారని కౌశల్ ముందుగానే చెప్పారు. కౌశల్ చెప్పిన విధంగా సన్నీ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన అంచనాలు ఎప్పుడు తప్పలేదు కనుక బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా విజేతగా బిందుమాధవి గెలుస్తుందని కౌశల్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఈసారి కూడా కౌశల్ లెక్క తప్పకుండా బిందుమాధవి గెలుస్తారా లేదా కౌశల్ లెక్క తప్పుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : Bigg Boss Non Stop Telugu: 3వ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే… బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి సారి ఇలా!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel