September 21, 2024

Health Tips : ఉడికించిన కోడిగుడ్డు ఎన్ని గంటలలోపు తినాలో తెలుసా? షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు..!

1 min read
pjimage 2022 03 14T110747.585

Health Tips : కోడిగుడ్ల ను రోజు తినడం వల్ల శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక కోడి గుడ్డు తినాలి అని ఆరోగ్య శాఖ కూడా సూచిస్తుంది. కోడి గుడ్డు లో విటమిన్ ఏ కూడా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామాలు చేసేవారు పచ్చి కోడిగుడ్ల ను తినడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడతారు. పచ్చి గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు కాకుండా కోడిగుడ్లను కేకులు తయారు చేయడానికి, బ్రెడ్ లో కలిపి టోస్ట్ గా, ఆమ్లెట్ వేసుకొని తినడం, ఇంకా అనేక రకాలుగా కోడిగుడ్లను తినడానికి ఇష్టపడతారు. అయితే చాలామంది కోడిగుడ్లను ఉడకబెట్టి ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచి తింటుంటారు. అయితే కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంచవచ్చు?? అసలు ఉడకబెట్టిన గుడ్డు ఎన్ని గంటల లోపు తినాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం……

pjimage 2022 03 14T110747.585కోడిగుడ్డును ఉడిగించిన తర్వాత రెండు నుంచి మూడు గంటల లోపు గుడ్లను తినడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది ఉడికించిన కోడిగుడ్లను పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు వారి బాక్స్ లో పెట్టి ఇస్తుంటారు. పిల్లలు స్కూల్ లో కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో ఉండడానికి వారికి ఎటువంటి అవకాశం ఉండదు. బయటి వాతావరణంలో కోడిగుడ్డు కేవలం మూడు గంటలు మాత్రమే ఉంచటం మంచిదని న్యూట్రీషన్లు చెబుతున్నారు. అందువలన చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళే సమయంలో కోడి గుడ్డు లంచ్ బాక్స్ లో పెట్టీ ఇవ్వటం వల్ల, వారికి కోడి గుడ్డు వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ.

ఉడికించిన కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో 4.4 డిగ్రీల సెల్సియస్ లోపల ఉండే టెంపరేచర్ లో వారం పాటు ఉంచవచ్చు. అయితే దీనిని పెంకుతో పాటు అలాగే ఉంచితే నిల్వ ఉంటాయి. పెంకు తీసిన తర్వాత గుడ్డు త్వరగా చెడిపోతుంది. ఆఫీస్ కి వెళ్ళే వారు కూడా కోడిగుడ్డును ఎక్కువ సమయం బయట టెంపరేచర్ లో ఉంచడం మంచిది కాదు. రోజూ గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ, దానిని ఉపయోగించే విధానం సరిగా లేకపోతే అనారోగ్య సమస్యలకు గురి కావలసి వస్తుంది.