Guppedantha Manasu November 10 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు, రిషి చూసి జగతి మహేంద్ర దంపతులు ఆనంద పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ వసుధార వీడియో చూపించడంతో అది చూసి జగతి దంపతులు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్ అక్కడ జరిగిన విషయాలు అని చెప్పడంతో జగదీదంపతులు సంతోష పడుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉన్నాడు కానీ వసుధర మిమ్మల్ని బాగా మిస్సయింది అంకుల్ అనడంతో మహేంద్ర వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు అందుకు సంతోషంగా ఉన్నారు కదా అంకుల్ ఇక్కడ ఎందుకు వచ్చేయండి అని అనడంతో మహేంద్ర రిషి ని ఎప్పుడు ఎప్పుడు కలుస్తానా అని నాకు కూడా ఉంది గౌతమ్ కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటాడు.
నీకోసం వాడు వాడి కోసం మీరు మీ ఇద్దరి బాధ చూడలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను అంకుల్ అని అంటాడు గౌతమ్. ఆ తర్వాత మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చి రిషి ఏం ఆలోచిస్తున్నావు వసుధార అని అడుగుతాడు. ఇదంతా జగతి మేడం వల్లే సార్ అనడంతో వెంటనే రిషి ఎన్ని కష్టాలు పడిన ఆఖరికి నువ్వు అనుకున్నది సాధించావు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు రిషి నీకేం కావాలో అడుగు వసుధార అని అనడంతో నాకేం వద్దు సార్ అని అంటుంది.
నువ్వు అడగాల్సిందే ఈ రిషేంద్ర భూషణ్ మాట ఇస్తే తప్పడు అని అంటాడు రిషి. అప్పుడు వసుధర జగతి మేడంని అమ్మ అని మాట్లాడుతూ ఉండగానే రిషి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో రిషి టెన్షన్ పడుతూ ఉండగా వెంటనే వసుధార జగతి మేడం గారు దీనికి కారణం మేడంకి నేను ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. అప్పుడు రిషి ఏం కావాలి అడుగు అనడంతో జగతి మేడంని చూడాలి సార్ ఆవిడకు పాదాభివందనం చేయాలి అని అంటుంది వసుధార.
Guppedantha Manasu నవంబర్ 10 ఎపిసోడ్ : వసుధర వీడియోలు దేవయని కి చూపిస్తాడు గౌతమ్…
కారు పోనీయండి సార్ నాకేం కావాలో చెప్తాను అని చెరువు దగ్గరికి తీసుకొని వెళుతుంది. అప్పుడు చెరువు దగ్గరికి తీసుకెళ్లిన వసుధార పడవలు తయారు చేస్తూ ఉంటుంది. ఇంతకుముందే పడవలు వదిలావు కదా వసుధార అని అనగా నా కోరిక వేరు ఈ కోరిక వేరు సార్ అని అంటుంది. నాకు వీటి మీద నమ్మకం లేదు కానీ నేను నీ కోసం చేస్తాను అని రిషి కూడా పడవలు తయారు చేస్తాడు. అప్పుడు రిషి తొందర తొందరగా చేయడంతో ఇంత ఫాస్ట్ గా ఎలా చేశారు సార్ అని అనగా మా గురువుగారు వసుధార నేర్పించారులే అని అంటాడు రిషి.
నేను ఎప్పుడు నేర్పించాను సార్ అని అనగా ఆరోజు లైబ్రరీలో నేర్పించావు కదా వసుధార అని అంటాడు రిషి. మరొకవైపు రిషి కోసం దేవయాని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ వసుధర టాపర్ అయ్యింది అని ఏం పార్టీలు చేసుకుంటున్నారు అనుకుని కుళ్ళుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. గౌతమ్ ఫోన్ కూడా కలవడం లేదు అని టెన్షన్ పడుతూ ధరణి ని పిలుస్తుంది. అప్పుడు ధరణి గదిలో నుంచి చెప్పండి అత్తయ్య అనే అనగా అక్కడ ఏం చేస్తున్నావ్ ధరణి అనడంతో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది గ్రీన్ టీ కావాలి అని దేవయాని అడగడంతో కొంచెం సేపు ఆగాలి అత్తయ్య అని అంటుంది ధరణి.
అంతగా ఏం చేస్తున్నావు అనడంతో పసుధార ఫస్ట్ వచ్చింది కదా స్వీట్ తయారు చేయమన్నాడు అని అంటుంది. అప్పుడు నన్ను అడగాలి కదా అనడంతో సరే అత్తయ్య రిషి వస్తే మీరు వద్దన్నారని చెబుతాను అనడంతో దేవయాని ఆశ్చర్య పోతుంది. అప్పుడు ధరణి కావాలని ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ అమాయకంగా దేవయానిని ఒక ఆట ఆడుకుంటుంది. వైపు రిషి, వసుధార ఇద్దరూ చెరువులో పడవలు వదులుతూ ఉంటారు. అప్పుడు వసుధార చెరువులో మాట్లాడుకుంటూ కింద పడిపోవడంతో కంగారుపడిన రిషి వెంటనే వసుధారని బయటకు పిలుచుకొని వస్తాడు. మరొకవైపు గౌతమ్ కావాలనే వసుధర వీడియోలు దేవయని కి చూపిస్తూ మరింత రెచ్చగొడుతూ ఉంటాడు.