Intinti Gruhalakshmi serial Sep 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు,లాస్యలు కంపెనీలో ఉండడానికి సామ్రాట్ ఒప్పుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో అభి గాయత్రీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గాయత్రి నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా అభి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు అభి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అంకిత మనసు మారడం లేదు ఆంటీ అని అనడంతో వెంటనే గాయత్రి అయితే విడాకులు ఇచ్చే అభి చచ్చినట్టు అంకిత మా ఇంటికి వస్తుంది అని అంటుంది.

అప్పుడు వెంటనే అభి మరి నా పరిస్థితి ఏంటి ఆంటీఅని అనగా,వెంటనే గాయత్రి అది నీ సమస్య అభి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు నందు లాస్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందు లాస్య ని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య ఒక్కొక్క ప్లాన్ వివరించగా వెంటనే నందు నిన్ను చూస్తే భయం వేస్తుంది లాస్య అని అనగా అలా ఏం కాదు నందు అంటుంది లాస్య.
ఆ తర్వాత తులసి ఇంట్లో వాళ్లకి చెప్పి నేను స్కూల్లో పిల్లలకు మిడిల్ క్లాస్ చెప్పడం కోసం ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు తులసి గురించి కాసేపు బాధపడగా ఇంతలోనే అక్కడికి ప్రెస్ వాళ్లు వస్తారు. సామ్రాట్ గారి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నిజమేనా అంటూ తులసిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు.
Intinti Gruhalakshmi serial Sep 7 Today Episode : తులసి పై కోపంతో రగిలిపోతున్న సామ్రాట్..?
కానీ తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మరొకవైపు సామ్రాట్ జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో పేపర్లో వచ్చిన వార్తను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే నందు లాస్యలు అక్కడికి వచ్చి సామ్రాట్ ని మరింత రెచ్చగొడతారు. అప్పుడు ఆ పేపర్ ని తీసుకొని సామ్రాట్ నేను ఇప్పుడే తులసి అంతు చూస్తాను అంటూ కోపంగా బయలుదేరుతాడు.
మరొకవైపు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు తులసి ఏం సమాధానం చెప్పకుండా సామ్రాట్ దగ్గరికి వెళ్లి అడగండి అని చెబుతుంది. ఇంతలోనే సామ్రాట్ తులసి ఇంటికి వస్తాడు. తులసి మీద ఒక రేంజ్ లో విరుచుకుపడతాడు. పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారా? అప్పుడు తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో హనీ వినాయక చవితి పండుగకు తులసి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది. మరొకవైపు తులసి కూడా హనీ రావడం ఇష్టమే అన్నట్లుగా దివ్యతో మాట్లాడుతుంది. ఇక హనీకి అసలు విషయం చెప్పలేక సామ్రాట్ లో లోపల మదన పడుతూ ఉంటాడు.
Read Also : Karthika Deepam: మోనితను రోడ్డుపై వదిలేసిన కార్తీక్.. డాక్టర్ బాబుకి తల మసాజ్ చేస్తున్న వంటలక్క..?