Karthika Deepam: మోనితకు చుక్కలు చూపిస్తున్న దుర్గ.. కార్తీక్ ముందు అడ్డంగా బుక్ అయిన మోనిత..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్, మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య తినకుండా సౌందర్య కోసం ఎదురు చూస్తూ ఉండగా చంద్రమ్మ తిను బంగారం మీ నానమ్మ వస్తుందిలే అని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంద్రుడు రావడంతో ఎక్కడికి వెళ్లావు గండ అని కోప్పడిగా సర్లే వెళ్దాం పద అనడంతో ఎక్కడికి వెళ్ళేది సౌర్యమ్మ రాను అంటుంది అంటూ జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు ఇంద్రుడు లోపలికి వెళ్లి తొందరగా తిను సౌర్యమ్మ వెళ్లిపోదాం అని అనగా ఎక్కడికి బాబాయ్ నానమ్మ వచ్చేవరకు నేను రాను అనటంతో ఇందాక మీ నానమ్మ రోడ్ లో కనిపించి నిన్ను తీసుకెళ్లడం లేదని నువ్వు నీకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లొచ్చు అని చెప్పింది అంటూ సౌర్యకు అబద్ధాలు చెబుతాడు ఇంద్రుడు.

Advertisement

అప్పుడు సరేలే బాబాయ్ ఎలాగో అమ్మానాన్నలు కనిపిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కదా నాన్నమ్మ దగ్గరికి అని అంటుంది. అప్పుడు సౌర్య ఇంద్రుడు మాటలు నిజమని నమ్మి సరే బాబాయ్ వెళ్దాం పదండి అని అంటుంది. మరొకవైపు సౌందర్య ఆనందరావు లు ఇద్దరు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సౌందర్య నన్ను కొట్టి నన్ను హైదరాబాద్ శివారులో వదిలి వెళ్ళింది అంటే అది మామూలు ఆడది కాదు ఎంతకైనా తెగిస్తుంది అనటంతో దాన్ని తెగింపు మనకు కొత్త కాదు కదా సౌందర్య అని అంటాడు ఆనందరావు.

Advertisement

అప్పుడు సౌందర్య ఆలోచిస్తూ ఆ మోనిత ప్రవర్తనను బట్టి చూస్తే నాకు ఎందుకు కార్తీక్ బతికే ఉన్నాడని అనిపిస్తుంది సౌర్య కూడా అంత ఖచ్చితంగా చెబుతోంది అంటే నాకు ఎందుకు నా కోడలు కొడుకు బతికే ఉన్నారు అన్న ఆశ కలుగుతోంది అని అనడంతో ఆనందరావు కూడా నాకు కూడా అదే అనుమానం కలుగుతుంది సౌందర్య అని సంతోషపడతాడు. వాళ్లు బతికే ఉన్నారు అన్న వార్త ఇంత సంతోషంగా ఉంది వాళ్ళు నిజంగా బతికి ఉంటే ఎంత బాగుంటుందో కదా అండి అని అనుకుంటూ ఉంటుంది సౌందర్య. మరొకవైపు మోనిత దేవుడి దగ్గరికి వెళ్లి దేవుడా నేను నిన్ను పదేపదే కోరికలు తీర్చమని నిన్ను వేధించను నేను ప్రయత్నం చేసిన తర్వాతే నీ మీద భారం వేస్తాను.

కానీ కార్తీకి గతం గుర్తుకు వచ్చిందో లేదో తెలుసుకోలేకపోతున్నాను నాకు ఎలాగో అలా తెలిసేలా చేసి ఈ బండారం నుంచి బయటపడేలా చేయి స్వామి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే దుర్గ అక్కడికి వచ్చి నాకు కూడా ఒక క్లారిటీ ఇవ్వు స్వామి అని అనడంతో వెంటనే మోనిత సీరియస్ అవుతూ నన్ను మనశ్శాంతిగా పూజ కూడా చేసుకొనివ్వరా ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నావు నేను నీకు ఏం పాపం చేశాను అని అనడంతో పాపం గురించి నువ్వే మాట్లాడాలి బంగారం అని వెటకారంగా మాట్లాడుతాడు దుర్గ. అప్పుడు దుర్గ కాసేపు మోనిత సతాయించి అక్కడి నుంచి వెల్లిపోతాడు.

Advertisement

మరొకవైపు సౌందర్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఎక్కువ రోజులు పాటు ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆనంద్ రావు సౌందర్య మాట్లాడుకుంటూ ఏ ఆడది చేయని పనులన్నీ ఈ మోనిత చేస్తోందండి అంటూ మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇప్పటికిప్పుడు ఆ మోనిత ను జుట్టు పట్టుకొని నిలదీయాలని ఉంది కానీ డాక్టర్ రెస్టు తీసుకోమని చెబుతున్నాడు అని అంటుంది సౌందర్య. మరొకవైపు మోనిత కార్తీక్ దీప లు ఏంటి ఇంత దగ్గరయ్యారు వీరి మధ్య ఏం జరుగుతోంది. అసలు వీరిద్దరూ కలిసి నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత.

ఏదో ఒకటి చేసే కార్తీక్ ను ఇక్కడ నుంచి దూరంగా తీసుకుని వెళ్లాలి సౌందర్య ఆంటీ వచ్చింది అంటే నన్ను చంపేస్తుంది అనుకుంటూ ఉంటుంది మోనిత. ఇంతలోనే శివ అక్కడికి వచ్చి మోనిత ను వెటకారంగా మాట్లాడిస్తాడు. ఏంట్రా మాటల్లో తేడా వస్తుంది అనడంతో రాదా మేడం మీరు చేసిన పనికి నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. హైదరాబాద్ కు వెళ్లే వరకు పోలీసులు ఎక్కడ ఆపుతారో ఆవిడకు ఎక్కడ గతం గుర్తుకు వస్తుందో అని భయపడి చచ్చిపోయాను మేడం అని అంటాడు. అవును మేడమ్ ఆవిడ ఎవరు ఎందుకు మీరు ఆవిడ తల పగలగొట్టారు అని అనగా వెంటనే మోనిత లోపలికి వెళ్లి లక్ష రూపాయలు తీసుకొని వస్తుంది.

Advertisement

నువ్వు అడిగిన ఆ ప్రశ్న ఖరీదు లక్ష రూపాయలు ఈ డబ్బు తీసుకొని ఇంకెప్పుడు ఆ ప్రశ్నను అడగకు అని ఇస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ వచ్చి ఆ డబ్బులు తీసుకొని ఎందుకు మోనిత శివకి ఇంత డబ్బులు ఇస్తున్నావు అనటంతో మోనిత షాక్ అవుతుంది. ఏదో ఒకటి చేసి టాపిక్ డైవర్ట్ చేయకపోతే నేను అడ్డంగా బుక్ అవుతాను అంటూ కార్తీక్ ని రివర్స్ లో అనుమానిస్తుంది మోనిత. చెప్తావా లేదా మౌనిక అనడంతో అవును కార్తీక్ దీన్నీ చెడు కోసమే ఉపయోగిస్తున్నాను ఆ వంటలక్క ను చంపడం కోసం శివకు డబ్బులు ఇస్తున్నాను అనడంతో శివ, కార్తీక్ షాక్ అవుతారు.

Advertisement