Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మల్లిక ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలో జానకీ అక్కడికి వచ్చి నేను వేస్తాను ముగ్గుపిండి ఇలా ఇవ్వు అని అడుగుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి ముగ్గు వేస్తాను అని చెప్పగా అప్పుడు మల్లిక జానకి చేతికి ముగ్గు పిండి గిన్నె ఇస్తుండగా ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వచ్చి నీకు బుద్ధుందా మల్లికా జానకి తో పనులు చేయిస్తావా! ఈరోజు నుంచి వంట పనులు ఇంటి పనులు అన్నీ నువ్వు ఒక్కదానివే చేయాలి జానకి ఎటువంటి పని చెప్పకూడదు అని అనడంతో మల్లిక ఆ మాటకు ఏడుస్తూ ఉంటుంది.
జ్ఞానాంబ ముగ్గు వేస్తూ ఇంట్లో నువ్వు ఒక వస్తువు మాత్రమే వస్తువులా ఉండాలి. ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని అనడంతో జానకి ఎంతో బాధపడుతుంది. ఇంతలో రామచంద్ర అక్కడికి వచ్చి చూశావా జానకి మా అమ్మ నీ గురించి ఎంత బాధ ఆలోచిస్తుందో అని చెప్పి జ్ఞానాంబ ను పొగిడి నేను షాప్ కి వెళ్లి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కానీ జానకి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఎలా అయినా అత్తయ్య గారికి నా మీద ఉన్న కోపం తగ్గించాలి అని జానకి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు యోగి జ్ఞానాంబ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలి పోతూ ఉంటాడు. ఇంతలో ఊర్మిళ మనం ఒకసారి జానకి ఇంటికి వెళ్లి వద్దాం.
అందులో రేపు మన బాబు బారసాల కోసం జానకి వాళ్లందరినీ పిలిచి వద్దాం. అంతేకాకుండా మన రెండు కుటుంబాలు కలవడానికి మీ నాన్నగారి ప్రతిరూపమైన ఈ బాబే వారధి అవుతాడు అని ఊర్మిళ అనగా ఆ మాటకు యోగి కోప్పడతాడు. మరొకవైపు జానకి కీ అకాడమీలో ఫీజు లక్ష రూపాయలు కట్టమని కాల్ చేస్తారు.
ఇంతలో అక్కడికి రామచంద్ర రావడంతో నేను ఐపిఎస్ చదవడం లేదు అని చెప్పి రామచంద్రకు షాక్ ఇస్తుంది జానకి. జానకి మాటలకు రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. కానీ జానకి మాటలను పట్టించుకోకుండా ఎలా అయినా జానకిని చదివించాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంతలో జ్ఞానాంబ దగ్గరికి ఆ విషయం చెప్పడానికి వెళ్లగా అందుకు ఆమె ఒప్పుకోదు.
ఆ తర్వాత జానకి నేను చాలా అదృష్టవంతురాలిని నేను ఎవరో తెలియకుండానే నాకు చదువు గిఫ్ట్ గా ఇచ్చారు అని రామచంద్రని పొగుడుతుంది. అలా వారిద్దరూ ఒకరికొకరు చేతిలో చేయి వేసుకుని ఒకవైపు మరొకరు చూసుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.