Janaki Kalaganaledu: రామచంద్ర కు ఇచ్చిన మాటను తప్పిన జానకి.. బాధలో జ్ఞానాంబం..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గోవిందరాజు మాటలకు జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు చిన్న తప్పు చేశాడని పేగు బంధాన్ని నువ్వు వదిలేసుకుంటావా? నీకు అబద్ధం చెప్పాడని రామాను ఇంత బాధ పెడుతున్నావు. కానీ నీ నమ్మకానికి జానకి ఆశకి మధ్య రామచంద్ర ఎంత నలిగిపోతున్నాడో నీకు అర్థం కావడం లేదు. ఆ శ్రీరాముడు అయినా తల్లి మాటలు జవదాటుతాడేమో కానీ మన రాముడు మాత్రం నీ మాటను జవదాటడు అంటూ గోవిందరాజులు, జ్ఞానాంబ కు ప్రయత్నం చేస్తాడు.

Advertisement

ఆ తర్వాత జానకీ గురించి మాట్లాడుతూ ఆరోజు గుడిలో తన ప్రాణాలను పణంగా పెట్టి మన అందరి ప్రాణాలను కాపాడింది అని చెప్పగా వెంటనే జ్ఞానాంబ మాట్లాడుతూ ఒకప్పుడు నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. రామ అంటే అంత గుడ్డి నమ్మకం ఉండేది కానీ నన్నే గుడ్డిదాన్ని చేసేసాడు అని జ్ఞానాంబ బాధపడుతుంది. అప్పుడు గోవిందరాజులు మాటలకు జ్ఞానాంబ మనసు ఎక్కడ కరిగిపోతుందో అని మల్లిక టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఇంతలోనే మల్లిక మధ్యలో కలగజేసుకొని జ్ఞానాంబ ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా గోవిందరాజులు నోరు ముయ్ మల్లిక నువ్వు మాట్లాడకు అని అనగా వెంటనే విష్ణు కూడా ఇంకొక మాట మాట్లాడావు అంతే చెంప పగులుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే జానకి జ్ఞానాంబ కాళ్ల మీద పడి జ్ఞానాంబను క్షమాపణలు అడుగుతుంది.

నాకు మీరు ఎటువంటి శిక్ష వేసినా భరిస్తాను కానీ ఆయనతో మాట్లాడండి అంటూ జ్ఞానాంబను బ్రతిమలాడుతుంది. అప్పుడు జ్ఞానాంబ నా పంతం కోసం పిల్లలను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అని మనసులో అనుకొని జానకి దగ్గర వాయినం పుచ్చుకుంటుంది. అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత జానకి గదిలోకి వెళ్లి తన తల్లిదండ్రుల ఫోటోల ముందు నిల్చుని నీకు ఇచ్చిన మాటని తప్పుతున్నాను మళ్లీ జన్మంటూ ఉంటే నేను మీ కడుపున పుట్టి మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను. ఈ కూతురు పరిస్థితిని అర్థం చేసుకోండి నాన్న అంటూ ఎమోషనల్ అవుతుంది. ఆ మాటలు విన్న రామచంద్ర ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత జానకి ఇకపై ఐఏఎస్ చదువుకోవాలి అన్న ఆలోచనలు విరమించుకుంటున్నాను అనటంతో రామచంద్ర షాక్ అవుతాడు. ఇక వారి మాటలు జ్ఞానాంబ వింటూ ఉంటుంది. అప్పుడు జానకి తన పుస్తకాలు రామచంద్ర చేతిలో పెట్టి ఇవి మన స్వీట్ షాప్ లో పొట్లాలు కట్టడానికి పనికి వస్తాయి తీసుకెళ్లండి అని చెబుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel