Karthika Deepam November 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్,దీపను ఓదారుస్తూ ఇంటికి పిలుచుకొని వెళ్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య ఇంద్రుడు అలా ఎందుకు చేశాడా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు చంద్రమ్మ ఏమయింది అలా ఉన్నావు అని అనగా వెంటనే ఇంద్రుడు నేను అలా ఎందుకు చెప్పానా అని ఆలోచిస్తున్నావా అని అంటాడు. అప్పుడు సౌర్య అవును బాబాయి అనడంతో ఇప్పుడు పూజారి గారికి నువ్వు మీ అమ్మ నాన్న పేరు చెబితే మమ్మల్ని ఎవరు అని అడుగుతారు అప్పుడు మొత్తం అంతా చెప్పాలి.

నిన్ను మీ తాతయ్య నానమ్మలు వెతుకుతున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజారిని అడిగితే మొత్తం తెలిసిపోతుంది అందుకే చెప్పలేదు అమ్మ అని అంటాడు ఇంద్రుడు. అప్పుడు మనం సంగారెడ్డికి ఎప్పుడు వెళ్దాం బాబాయ్ అని అనగా సంగారెడ్డిగా ఎందుకు జ్వాలమ్మ అనడంతో సౌర్య షాక్ అవుతుంది. అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు అని అనడంతో అంటే ఇప్పుడే వచ్చాము కదా అమ్మ ఇల్లు సర్దుకోవాలి అంటాడు ఇంద్రుడు. అప్పుడు సౌర్య ఎందుకో నువ్వు టెన్షన్ పడుతున్నావు నీ మీద నాకు అనుమానంగా ఉంది బాబాయ్ అని అంటుంది. మరొకవైపు మోనిత దీప ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది.
వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దుర్గా అక్కడికి వచ్చి దీపమ్మ అని పిలవడంతో దీప లేదు అనగా మరి నువ్వేం చేస్తున్నావు ఇంటికి కుక్కలా కాపలా కాస్తున్నావా అనడంతో అరే కుక్క అని మాట్లాడకు అని దుర్గా మీద సీరియస్ అవుతుంది. అప్పుడు దుర్గ అలా సీరియస్ అవుతావు ఏంటి బంగారం అని ప్రేమగా మాట్లాడుతూ విసగిస్తూ ఉండగా మోనిత అక్కడి నుంచి వెళ్లి లోపల కూర్చుంటుంది. అప్పుడు దుర్గ అక్కడికి కూడా వెళ్లి మోనిత ను సతాయిస్తూ ఉంటాడు. అప్పుడు మోనిత ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్న ఏం కావాలి అని అంటుంది.
అవును బంగారం ఇప్పుడు డాక్టర్ బాబు దీపమ్మ కలిసి వస్తారు కదా అని అంటే వాళ్ళు కలిసి రారు రారు అన్నడంతో ఇంతలోనే అక్కడికి దీప,కార్తీక్ ఇద్దరు కలిసి వస్తారు. అది చూసిన మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్ అక్కడికి రావడంతో దుర్గ కార్తీక్ ముందు మోనిత ను అడ్డంగా బుక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ స్టాఫ్ ఉన్నారని చెప్పి ఇక్కడ ఏకాతంగా గడపడానికి తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళారా మోనిత అని అనడంతో ఆపు కార్తీక్ నా విషయం పక్కన పెట్టు అసలు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని కార్తీక్ కి నిలదీస్తుంది.
Karthika Deepam నవంబర్ 9 ఎపిసోడ్ :ఇంద్రుడు, జ్వాల అనడంతో సౌర్య షాక్..
అప్పుడు దీప డాక్టర్ బాబు నాకు గొడవ పడే ఓపిక లేదు అనడంతో వెంటనే మోనిత డాక్టర్ బాబును తీసుకెళ్లి ఊరంతా తిప్పడానికి టైం ఉంటుంది నాతో మాట్లాడటానికి ఓపిక లేదా అని అనడంతో వెంటనే కార్తీక్ ఎవరు ఎవరిని పట్టుకుని వేధిస్తున్నారు మోనిత నువ్వు ఫస్ట్ ఇకనుంచి వెళ్దాం పద అని మోనిత ను అక్కడి నుంచి లాక్కొని వెళ్తాడు. ఆ తర్వాత సౌర్య ఫోటోని చూస్తూ దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు ఆనందరావు,హిమ ఒకచోట ఉండగా ఇంతలో అక్కడికి లక్ష్మణ్ రావడంతో పలకరిస్తాడు.
మరొకవైపు మౌనిక కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్న అనుమానంతో కార్తీక్ పర్స్ చూడగా చాలా డబ్బులు ఉండటంతో ఇన్ని డబ్బులు కార్తీక్ ఎక్కడివి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. ఏంటి మనతో నా పరిస్థితి చెక్ చేస్తున్నావు అనటంతో అప్పుడు మోనిత అబద్ధం చెప్పగా చిల్లర వేషాలు వేయద్దు మోనిత అని అంటాడు. అప్పుడు ఇన్ని డబ్బులు నీకు ఎక్కడివి కార్తీక్ అనడంతో నేను డాక్టర్ని కదా సర్జరీలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను అనగా మోనిత షాక్ అవుతుంది.
మరి లేకపోతే ఏంటి మోనిత నా దగ్గరికి ఎలా వస్తాయి పనే పాట నా గోల్డ్ చైన్ ని అమ్మేశాను అనడంతో మౌనిక శాఖ ఎందుకు అమ్మేశావు కార్తీక్ అంత అవసరం ఏమి వచ్చింది అని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గా వచ్చి థాంక్యూ బంగారం గోల్డ్ చైన్ బాగుంది కదా నువ్వే ఇచ్చావు కదా అనడంతో కార్తీక్ కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత ఏడుస్తూ దుర్గ కాలర్ పట్టుకుని నేను నీకు గోల్డ్ చైన్ ఇచ్చానా ఎందుకురా నన్ను ఇలా సతాయిస్తున్నావ్ అని నిలదీస్తుంది. అప్పుడు దుర్గ, దీపమ్మకి కార్తీక్ సార్ ని అప్పగించాలి అంటే ఇలాంటి గిఫ్టులు ఇవ్వాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది బంగారం అని అంటాడు.