...

Janaki Kalaganaledu: ఆనందంలో జ్ఞానాంబ కుటుంబం.. సరికొత్త ప్లాన్ వేసిన మల్లిక..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

అర్ధరాత్రి అందరూ పడుకొని ఉండగా అప్పుడు రామచంద్ర దొంగచాటుగా ఇంట్లో కి వెళ్లడం మల్లికా చూసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆలోచిస్తుంది. ఇంతలో రామచంద్ర రావడం చూసి ఏమీ తెలియనట్టు గా పడుకుంటుంది. అప్పుడు రామచంద్ర జానకి గోరింటాకు పెడుతూ ఉంటాడు. అప్పుడు మల్లిక తన మనసులో బావ గారు మీరు మామూలు మనిషి కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

ఇక ఎలా అయినా జానకి రామచంద్ర ను డిస్టర్బ్ చేయాలి అనుకున్న మల్లిక గట్టిగా కావాలి అని ఒక తుమ్ము తుంది. ఉలిక్కిపడిన రామచంద్ర మళ్లీ వెళ్లి పడుకుంటాడు. అలా చివరికి రామచంద్ర జానకి కి గోరింటాకు పెట్టేస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం ఇంట్లో వెన్నెల నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అందరూ నిశ్చితార్థ వేడుకలో హడావుడిగా ఉంటారు.

ఇక మల్లికా మాత్రం జరగని పెళ్లికి ఎందుకు ఇంత హడావిడి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లికను చూసిన మైరావతి అందరూ ఏదో ఒక పని చేస్తుంటే నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావ్ అని పడుతుంది. అప్పుడు నాకు ఎవరూ పని అప్పుడు చెప్పలేదు అని మంచిగా అనగా అప్పుడు మైరావతి మల్లికకు బోలెడంత పని అప్పజెబుతుంది. ఈ లోపు దిలీప్ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కోసం మైరావతి ఇంటికి వస్తారు.

గోవిందరాజు ఫ్యామిలీ అందరూ వెళ్లి వారిని రిసీవ్ చేసుకుంటారు. అందరూ వెళ్లిన తర్వాత ఓబులేసు ఏదో ఆలోచిస్తూ ఉండగా జానకి, రామచంద్ర లు టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు జానకి, రామచంద్ర లు నిశ్చితార్థం వేడుకల్లో భాగంగా సంతోషంగా ఉంటారు. చూసి కుళ్లుకుంటున్న మల్లిక ఓబులేసు కి నిజం చెప్పేయ మని చెబుతూ ఉంటుంది. అప్పుడు ఓబులేసు గుర్తుకొచ్చింది అనే పెద్దమ్మ గారు అని చెప్పబోతుండగా జానకి ఒక పాట పాడి ఆ విషయం గురించి చెప్పకుండా కవర్ చేస్తుంది.

అప్పుడు మల్లిక జానకి ని పక్కకి రా నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇక మరొకవైపు మల్లిక మైరావతి తో జ్ఞానాంబ ముద్దుల కోడలు జానకి ఆమెను వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ జానకి, రామచంద్ర ల ప్లాన్ ను బయట పెట్టేస్తుంది మల్లిక. ఇక నిజం తెలిసిపోతుంది అని జానకి ఏడుస్తూ ఉంటుంది.. మీ పెద్దకొడుకు రామచంద్ర, జానకి కలసి పెద్ద గూడుపుఠాణి చేశారు అత్తయ్య గారూ అంటూ జ్ఞానాంబతో చెబుతుంది. ఆ మాట విన్న జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.