Malli Serial July 28 Today Episode : నిజం బయట పెట్టడానికి సిద్ధపడిన అరవింద్

Malli Serial July 28 Today Episode
Malli Serial July 28 Today Episode

Malli Serial July 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మల్లి కి మరియు అరవింద్ కి పెళ్లి జరుగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అరవింద్ మల్లి తో నాకు ఒక హెల్ప్ చేస్తావా మీ వాళ్లు ఇంకేమైనా పూజలు వ్రతాలు అంటే వాటిని ఆపించేసి నన్ను లాడ్జిలో ఉండేలాగా మీ వాళ్లకు చెప్పి ఒప్పిస్తావా అంటాడు. అప్పుడు సత్య మరియు మీరా అక్కడికి వస్తారు. అప్పుడు మీరా బాబు గారు అల్లుడు అంటే మాకు దేవుడితో సమానం అలాంటి మీరు దేవాలయం లాంటి ఇల్లు వదిలి ఎక్కడో ఉంటావు అంటే ఎలా ఒప్పుకుంటాను అంటుంది. సత్య మీ లాంటి అందమైన చదువుకున్న వాళ్లు మా ఊర్లో లేరు మీకు బలవంతంగా పెళ్లి జరిగిన మీరు మా మల్లి నీ అంగీకరించారు. మీలాంటి మంచి వాళ్ళు దొరకడం మా అదృష్టం అంటాడు.

Malli Serial July 28 Today Episode
Malli Serial July 28 Today Episode

అల్లుడు గారే కాదు అతని కుటుంబం కూడా చాలా మంచిది. వాళ్ళకి తెలియకుండా పెళ్లి జరిగినా మన మల్లి నీ కోడలిగా ఒప్పుకున్నారు. మీరు నమ్ముతారో లేదో అల్లుడు గారు పగటి కలలు నిజమవుతాయానీ మల్లి కోసం పగలు నిద్ర పోయి కలలు కనేదాన్ని మల్లి చదువుకుంటుంది కాబట్టి మంచి భర్త వస్తాడు అనుకునేదాన్ని. మల్లి జీవితం బాగా ఉండాలని ఆ సీతారాముని మొక్కుకునే దాన్ని నిజంగానే దేవుడు లాంటి భర్త వచ్చాడు అంటుంది. అరవింద్ సత్య తో నేను మల్లి మీ దగ్గర ఒక విషయం దాచాము. నేను ఇక్కడికి వచ్చింది ఒక ఇంటర్వ్యూ పనిమీద గవర్నమెంట్ వాళ్లు నీతో చర్చలు జరపాలి అనుకుంటున్నారు అనగానే సత్య రేపు మా ఊర్లో బోనాల పండుగ ఉంది అది అవగానే నేను మీతో ఇంటర్వ్యూకి సిద్ధం అంటాడు. మీరా అల్లుడుగారు రేపు మీరు మల్లికి బోనం ఎత్తాలి.

Advertisement

అప్పటివరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అంటూ అక్కడి నుండి వెళ్ళి పోతుంది. ఇక అరవింద్ జరిగిన విషయం సత్య కి చెప్పాలనుకుంటాడు. అప్పుడు మల చెప్పాలనుకుంటాడు. అప్పుడు మల్లి మీరు ఈ విషయం బాపు కి చెప్పాలనుకుంటున్నారా వద్దు బాబు గారు మీకు దండం పెడతాను మా ఊరి వాళ్ళు నా నుదుట పెట్టిన కుంకుమను బలంగా నమ్ముతారు. ఆ కుంకుమ పెడితే వారి బంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని గట్టిగా నమ్ముతారు. మీరు ఈ విషయం ఇప్పుడు చెబితే మిమ్మల్ని ఏమైనా చేస్తారు అంటూ అరవింద్ ని ఆపుతుంది. అప్పుడు అరవింద్ నా చెయ్యి వదులు నాకేమైనా జరుగుతుందని నేను మాలిని కి అన్యాయం చేయలేను అంటాడు. అప్పుడు మల్లి బాబు గారు నేను ఆలోచించేది అక్క గురించి నీకేమైనా జరిగితే అక్క బ్రతకలేదు అంటుంది. ఇప్పుడు మీరు ఏ విషయం చెప్తే మా వాళ్ళు మీ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తారు అనగానే అరవింద్ ఏంటి బెదిరిస్తున్నావా అంటాడు.

Malli Serial July 28 Today Episode
Malli Serial July 28 Today Episode

అప్పుడు మల్లి లేదు బాబు గారు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. అప్పుడు అరవింద్ ఒకవేళ నేను నిన్ను విడిచి పెట్టి వెళ్తే అప్పుడు కూడా మీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కదా అనగానే ఆ నింద నా మీదనే వేసుకుంటాను అంటుంది మల్లి. అప్పుడు సత్య అక్కడికి వచ్చి ఏమైంది మల్లి ఎందుకు అలా ఉన్నావ్ అనగానే అరవింద్ ఏం లేదు సత్య ఇక్కడే ఉంటున్నాను అంటాడు. అప్పుడు సత్య అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అల్లుడు గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మల్లి నేనేం చేసినా మీ కోసమే బాబు గారు ఈ జీవితం నీకే అంకితం అనుకుంటూ ఉంటుంది. ఇక మల్లి, అరవింద్ పడుకోవడానికి అన్నీ సిద్ధం చేస్తుంది. అప్పుడు మల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అదేంటి మీరు వేర్వేరుగా పడుకోవడం ఏంటి అంటారు. మీ ఇద్దరికీ శోభనం జరిపించాలని పిన్ని ఏర్పాటు చేస్తుంది.

Advertisement

ఇక ఈ రోజే పెళ్లి అయింది కాబట్టి రేపు బోనాల పండుగ అవ్వగానే కార్యం జరిపిస్తుంది అంటారు. అప్పుడు మల్లి మీకు ఏం మాట్లాడాలో తెలియద వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఆయననీ ఏదో ఒక రక చూస్తున్నాను ఆయననీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పేడుతున్నారు. మీరంతా ఖాళీగా ఉంటే వెళ్లి ఊరంతా శుభ్రం చేయండి. స్కూల్లో మొక్కలు నాటండి, రామాలయం అంతా మంచిగా చేయండి .అంతేకాని నోటికొచ్చింది మాట్లాడి ఆయననీ ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. సర్లే గానీ నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందో మాకు చెప్పు అంటారు. అప్పుడు మల్లి ఏముంది అక్కడికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పారు వాళ్లు ఒప్పుకున్నారు అంటుంది.

Malli Serial July 28 Today Episode
Malli Serial July 28 Today Episode

అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అబద్దాలు చెప్పకు మల్లి మీ పెళ్లి జరిగేటప్పుడు మీ ఆయనకు నువ్వు ఇష్టం లేదు నిన్ను అక్కడికి తీసుకెళ్లడం కూడా అతనికి ఇష్టం లేదు కానీ మీరు ఇప్పుడు అన్యోన్యంగా కలిసి ఇక్కడికి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ సీత రాములు మిమ్మల్ని కలిపారని అందరు అనుకుంటున్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి మల్లి నిన్ను ఎంతగానో ప్రేమించే వాడు నీకు భర్తగా వచ్చాడు. సర్లే కానీ నువ్వు ఇక్కడ కూర్చో మీ అత్త గారి ఇల్లు ఎలా ఉంటుంది. మీ రూమ్ ఈ ఇల్లు కన్నా పెద్దగా ఉంటుంది కదా? మీకు రూమ్ లోనే స్నానాల గదులు ఉంటాయి కదా? అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు. అప్పుడు మల్లి మా గది మన ఊరి సర్పంచ్ గారి ఇల్లు ఎంత ఉంటుంది. మా ఇల్లు చూడాలంటే మెడ నొప్పి లేస్తుంది. ఇక మా గది అయితే తాజ్ మహల్ లాగా మెరిసిపోతూ ఉంటుంది.

Advertisement

మూడు పూటలా మా గదిని శుభ్రం చేయడానికి పని మనుషులు ఉంటారు. రవ్వంత దుమ్ము కూడా ఉండదు. శుభ్రంగా ఉండకపోతే మా ఆయనకు నచ్చదు అంటుంది. ఇక నేను పడుకునే మంచం అయితే చాలా మెత్తగా ఉంటుంది అదంతా నాకు ఒక కల లాగే ఉంటుంది అని మల్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తుంది. ఇక మీరా మల్లి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా అందరు బోనాలు తీసుకెళ్తున్నారు బాబు గారికి కుంకుడుకాయతో తలంటి నలుగు పెట్టి స్నానం చేయించి తర్వాత నువ్వు చెయ్యి అంటుంది.  అప్పుడు మల్లి అమ్మ అలా చేయడం అతనికి ఇష్టం ఉండదు అంటుంది. అప్పుడు మీరా అరవింద్ ని చూసి బాబు గారు మీకు మల్లి తలంటి స్నానం చేపించి నలుగు పెట్టాలి ఇది మా ఊరి సాంప్రదాయం అని చెప్తుంది.

Malli Serial July 28 Today Episode
Malli Serial July 28 Today Episode

అప్పుడు అరవింద్ ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు నేను చేస్తాను అంటాడు. అప్పుడు మీరా వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వీళ్లిద్దరు అన్యోన్యంగా లేరు మన ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారు అంటుంది. అప్పుడు మల్లి హే నకిలీ నీకు ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ తెలీదా అంటుంది. అప్పుడు మీరా వాళ్ళ అమ్మ నువ్వు తలంటు స్నానం చేపిస్తేనే నేను మిమ్మల్ని నమ్ముతాను అంటుంది. అప్పుడు మల్లి నేను తలంటుస్నానం చేపిస్తాను ఇంకోసారి మేము అన్యోన్యంగా లేవు అంటే నీ నాలుక కోసేస్తాను అంటుంది. అరవింద్ నీ రండి బాబు గారు నీకు స్నానం చేపిస్తాను అంటూ అక్కడి నుండి తీసుకెళుతుంది. మల్లి, అరవింద్ కి స్నానం చేపిస్తుంటే తన వైపు కోపంగా చూస్తాడు. అప్పుడు మల్లి ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు సరే నేను చేపించనులేండి ఈ విషయం నకిలీ కి తెలిస్తే రచ్చ రచ్చ చేస్తుంది. అప్పుడు మన విషయం మాలిని అక్కకి ఇంట్లో వాళ్ల అందరికీ తెలిసిపోతుంది అంటుంది. ఇక రేపు ఏం జరగబోతుందో చూద్దాం.

Advertisement

Read Also : Malli Serial July 27 Today Episode : పెళ్లి సంతోషంలో తుళ్లి పడుతున్న మల్లి.. అసలు నిజం చెప్పనున్న అరవింద్..

Advertisement