Guppedantha manasu Mar 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రిషి, మహేంద్ర చేసిన పనికి జగతిపై కోప్పడుతూ జగతి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు వసుధార జగతి వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది.
కానీ రిషి ఈ మాత్రం వసుధార చెప్పేది వినకుండా మీ మేడం అవకాశవాది, కావాలనే చేసింది అంటూ జగతి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది అని అంటాడు రిషి. వసుధార, రిషి మాట్లాడుతున్న మాటలు విని షాక్ అవుతూ ఇలాంటి ఘోరమైన మాటలు ఎలా మాట్లాడుతున్నారు సార్.

మీరు ఎందుకు ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అని అంటుంది. అయినప్పటికీ రిషి కోపంలో జగతి గురించి మరింత తప్పుగా మాట్లాడుతూ ఉండగా ఆపండి సార్.. ఈ విధంగా మాట్లాడడానికి మీకు ఎలా ఉన్నా నాకు వినడానికి చాలా అసహ్యంగా ఉంది అని అంటుంది వసుధార. ఇంతలో అక్కడికి గౌతం వచ్చి రిషి ని కూల్ చేయడానికి మాట్లాడుతాడు.అప్పుడు గౌతమ్ ఫై కూడా రిషి ఫైర్ అవుతాడు. అలా కొద్దిసేపు రిషి, గౌతమ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
మరొక వైపు దేవయాని,ఫణీంద్ర, ధరణి కారులో ప్రయాణిస్తుండగా దేవయాని జగతి గురించి తప్పుగా మాట్లాడుతుంది.నేను మొదటినుంచి చెబుతున్నా మీరు కూడా వినిపించుకోలేదు అని ఫణీంద్ర ని నిలదీస్తుంది. అప్పుడు ఫణీంద్ర ఈ విషయం గురించి మళ్లీ మాట్లాడితే బాగుండదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు జగతి మహేంద్ర తన ఇంట్లోకి రావద్దు అని చెబుతుంది. అప్పుడు నేనేం చేశాను జగతి అని మహేంద్ర అడగగా.. నేను రిషి కోసమే ఇన్ని రోజుల పాటు దూరంగా ఉన్నాను.
కానీ ఈ రోజు రిషి నే బాధ పెట్టావు అని అంటుంది జగతి. అప్పుడు మహేంద్ర జగతి కి సర్ది చెబుతూ, అక్కడ అవమానించింది నా భార్య జగతి ని, రిషి అమ్మని కాదు అని అనగా వెంటనే జగతి మహేంద్ర ను హత్తుకొని ఏడుస్తుంది. మరొకవైపు వసుధార గౌతమ్ కి ఫోన్ చేసి రిషి సార్ ని జాగ్రత్తగా చూసుకోండి. సార్ అన్ని విషయాల్లో బాగుంటాడు ఒక జగతి మేడం విషయంలో తప్ప అని చెబుతుంది.
మహేంద్ర తన ఇంటికి రాగా దేవయాని మహేంద్ర ని ఆపుతూ నాకు జరిగిన దానికి సమాధానం కావాలి అని అనగా అప్పుడు మహేంద్ర జరిగిన దానికి నేను ఎవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు. జగతి నా భార్య అని చెప్పినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha manasu: మహేంద్ర చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న దేవయాని,రిషి..?
- Guppedantha Manasu: మరింత దగ్గరవుతున్న వసు,రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
- Guppedantha Manasu june 14 Today Episode : ఎట్టకేలకు రిషి పై ప్రేమను బయట పెట్టిన వసుధార.. మీరు లేకపోతే ప్రాణాలతో ఉండలేనంటూ?
- Guppedantha Manasu Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : వసుధారని చూసి షాక్ అయిన జగతి దంపతులు.. అదేంటో తెలుసుకోవాలనే ఆరాటంలో దేవయాని..?














