Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి నందు, లాస్య లు అక్కడే ఉండడానికి ఒప్పుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి లాస్య దంపతులను అక్కడే ఉండమని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అప్పుడు లాస్య హనీ తో మీ డాడీ రాలేదా అని అనగా వచ్చారు ఏదో మీటింగ్ ఉంది అని కారులో ఉండిపోయారు అని అంటుంది. అప్పుడు తులసి సామ్రాట్ ని లోపలికి పిలవడానికి వెళుతూ సామ్రాట్ గారు నాతో మాట్లాడతారా అని ఆలోచిస్తూ బయటకు వెళ్తూ ఉంటుంది

అప్పుడు లాస్య నందుతో సామ్రాట్ లోపలికి రాలేడు రాడు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు తులసి సామ్రాట్ దగ్గరికి వెళ్లి క్షమించండి. హనీ తో పాటు మిమ్మల్ని కూడా పూజకు పిలవాల్సింది అనటంతో వెంటనే సామ్రాట్ పరవాలేదు అని అంటాడు. అప్పుడు సామ్రాట్ ఇప్పుడు మన మధ్య ఎటువంటి సంబంధం లేదు నేను ఎందుకు రావాలి అని అనగా వెంటనే తులసి మీరు ఏదో మనసులో పెట్టుకొని అంటున్నారు అని అంటుంది.
అప్పుడు సామ్రాట్ అదంతా ఏమీ లేదు అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడతాడు. అప్పుడు తులసి కొంచెం కూల్ అయ్యి సామ్రాట్ ని లోపలికి రమ్మని పిలుస్తుంది. సామ్రాట్ తులసి రావడం చూసి నందు లాస్యలు షాక్ అవుతారు. అప్పుడు సామ్రాట్ దగ్గరికి వెళ్లిన నందు లాస్యలు అయ్యో మిమ్మల్ని చూడలేదు సార్ అని అనగా పర్లేదు అని అంటాడు సామ్రాట్.
అప్పుడు హనీ నాన్న మీరు కూడా పూజలో కూర్చోవాలి అని అనగా వెంటనే అభి మీరు మా అమ్మకు స్వారీ చెప్పి పూజలు కూర్చోవాలి అని అనగా వెంటనే తులసి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటుంది. హనికి అర్థం కాక ఏం జరిగింది అని అడగగా చెబుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి కంకణాలు కట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు.
అప్పుడు అభి దంపతులు నందు దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అభి ప్రేమ్ ను కూడా వెళ్ళమని చెప్పగా కానీ ప్రేమ మాత్రం ఇష్టం లేని పని నేను చేయను అని అంటాడు. తర్వాత అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్న నవ్వుతూ ఉంటారు. అది నందు, లాస్య లు జీర్ణించుకోలేకపోతారు.
- Karthika Deepam june 7 Today Episode : నా పెళ్ళి నా ఇష్టం అన్న నిరుపమ్..సత్య ఇంటికి వచ్చిన స్వప్న..?
- Intinti Gruhalakshmi September 9 Today Episode : బయటపడ్డ నందు,లాస్య నిజస్వరూపం.. కోపంతో రగిలిపోతున్న సామ్రాట్..?
- Intinti Gruhalakshmi Oct 18 Today Episode : లాస్యని ఉద్యోగంలో నుంచి పీకేసిన సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న లాస్య..?













