Intinti Gruhalashmi june 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని అభి నానా రకాల మాటలు అనడం తో అంకిత వారిపై విరుచుకుపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో అభి మాట్లాడిన మాటలకు అంకిత కోపంతో రగిలిపోతూ అభికీ స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా ఆంటీ మౌనంగా ఉంది అంటే ఆంటీ గొప్పతనం ఏంటో తెలుసుకో అని అభి పై ఫైర్ అవుతుంది. నువ్వు అన్నావు కదా మరో తులసిని తయారు చేస్తుంది అని అంతకంటే అదృష్టం మరొకటి లేదు అని అంటుంది అంకిత.

కానీ నువ్వు నందగోపాల్ లాగా చేస్తే మాత్రం తులసి ఆంటీ లాగా నేను ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తులసి ఆంటీని అన్న మాటల స్థానంలో నేను ఉంటే నీ చెంప పగలగొట్టే దాన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ దండం పెడుతుంది అంకిత. ఆ తర్వాత అభి అన్న మాటలను తలచుకొని తులసి బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు తులసి కుటుంబం తులసి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అంకిత అంతా నా వల్లే జరిగింది అని బాధపడుతూ ఉండడంతో తులసి అంకితను చేరదీస్తుంది. మరొక వైపు శృతి ఇంట్లో పాటలు వింటూ బట్టలు కుడుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ బయట నుంచి చిరాకుగా వచ్చి ఆ పాటలు ఆఫ్ చేస్తాడు.
అప్పుడు శృతి బయట కోపం ఇంట్లో చూపించకు అని అనగా అప్పుడు ప్రేమ్ బయట కోపం కాదు అభి పై కోపం అని చెప్పి జరిగినదంతా వివరిస్తాడు ప్రేమ్. అప్పుడు శృతి తన వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంకితకు ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకోవాలి అని అనుకొని మళ్ళీ వద్దు అని నిర్ణయించుకుంటుంది.
ఆ తర్వాత తులసి పాటలు పాడుతూ ఉండగా ఇంతలో అంకిత అక్కడికి వచ్చి పొగుడుతూ ఉంటుంది. అప్పుడు శృతి ఫోన్ చేసి నా వల్లే జరిగింది కదా అని అనడంతో అంకితం లేదు అంటూ అలా వారు ఒకరికి ఒకరు బాధ గురించి చెప్పుకుంటూ ఉండగా అది చూసి మురిసిపోతూ ఉంటుంది.
మరొక వైపు నందు కంపెనీ పెట్టుబడి కోసం ప్రయత్నిస్తూ వుండగా లాస్య 20 లక్షలు ఇస్తాను అని అనడంతో నందు నమ్మకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు లాస్య తులసి ఎలా అయినా నీతో 20 లక్షలు పెనాల్టీ కట్టిస్తాను అని అంటుంది.
Read Also : Intinti Gruhalakshmi : అభిపై మండిపడిన అంకిత.. నందుకి స్ట్రాంగ్ గా బుద్దిచెప్పిన అనసూయ..?