Karthika Deepam Dec 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ సౌందర్య ఆ దేవుడు నా మొరను ఆలకించాడు నా కొడుకు కోడల్ని తిరిగి పంపించాడు అని ఎమోషనల్ అవుతూ ఉండగా మేము వచ్చేసాము కదా మమ్మీ ఏడవకు అని కార్తీక్ అనడంతో వెంటనే ఆనంద్ రావు ఇన్ని రోజులు బాధతో ఏడ్చింది ఇప్పుడు సంతోషంతో ఏడుస్తుంది ఏడవనివ్వు కార్తీక్ అని అంటాడు. అప్పుడు సౌందర్య అవును కార్తీక్ మీరు బతికున్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు అని సౌందర్య అడగగా వెంటనే కార్తీక్ నేను చెప్పే పరిస్థితిలో లేను మమ్మీ గతం మొత్తం మర్చిపోయాను గతం గుర్తుకు వచ్చేసరికి నేను మోనిత భర్తగా ఉన్నాను అంటూ జరిగింది మొత్తం వివరించడంతో సౌందర్య షాక్ అవుతుంది.
అప్పుడు దీప నేను కూడా బతికి ఉన్నట్లే ఆయన బతికి ఉంటారని వెతకడానికి వెళ్లాను కనిపించారు అత్తయ్య అంటూ ఆ మోనిత చేసిన ప్లాన్లు అని వివరించడంతో సౌందర్య వాళ్ళు ఆశ్చర్యపోతారు. సౌర్య కూడా అక్కడే ఉంది మమ్మీ మమ్మల్ని వెతుకుతూ అక్కడే ఉంది అని అనగా వెంటనే దీప అవును అత్తయ్య సౌర్య మీ దగ్గర ఎందుకు లేదు ఎందుకు అక్కడే ఉంది మీరు తనని విడిచిపెట్టి ఎందుకు హైదరాబాదుకు వెళ్లారు చెప్పండి అత్తయ్య అని అంటుంది. అప్పుడు అదంతా జరిగినట్టు కారులో వెళ్తూ దీప ఊహించుకొని కళ్ళు తిరిగి కోల్పోతుంది.
అప్పుడు కార్తీకదీపం చూసి ఏమైంది దీప అని అడగగా దీప రెస్పాండ్ కాకపోయేసరికి భయపడుతూ ఉంటాడు. అప్పుడు అదిగో చూడు దీప ఇంటికి వచ్చేసాము హిమ బయట నిలబడింది చూడు దీప అనగా దీప పలకకపోవడంతో వెంటనే కార్తీక్ అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్తాడు. మరొకవైపు ఇంద్రుడు తాను హైదరాబాద్ కి వెళ్తున్నాను అన్న విషయం చెప్పడంతో చంద్రమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండగా ఏం జరిగింది చంద్రమ్మ అని అనడంతో నాకు సౌర్యం ఇవ్వడం ఇష్టం లేదు అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటుంది చంద్రమ్మ.
మరొకవైపు కార్తీక్ దీప రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా ఫుల్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడు చారుశీల ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా కూడా కార్తీక్ దీపను చూసి మరింత ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దీప ఈరోజు ఈ స్థితికి రావడానికి నేనే కారణం చారుశీల అంటూ ఫుల్ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. ఇప్పుడు చారుశీల దీప గుండె చాలా వీక్ గా ఉంది పరిస్థితి చేయి దాటిపోయింది ఇప్పుడు ఏం చేయలేం కార్తీక్ గుండె మార్పిడి ఒక్కటే చేయగలం అనడంతో కార్తీక్ మరింత ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ఎలా అయినా చేసి దీపం ఒప్పించు కార్తీక్ అని అనగా సరే అని అంటాడు.
మరొకవైపు సౌందర్య దీప కార్తీక్ ఫోటోలకి ఉన్న దండలు తీసేయక ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి నీకు కూడా నమ్మకం కలిగిందా సౌందర్య అని అడగగా నిన్నటి వరకు కేవలం భాష మాత్రమే ఉండేది ఇప్పుడు నమ్మకం కలిగింది అని కార్తీక్ దీపం లను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది సౌందర్య. మరొకవైపు ఇంద్రుడు హైదరాబాద్ కి వెళ్లడానికి రెడీ అవ్వగా వెళ్లి వస్తాను బంగారు అనడంతో అప్పుడు చంద్రమ్మ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆగు బాబాయ్ నువ్వు బయటికి పని మీద వెళ్తున్నావ్ మరి పిన్ని ఎందుకు ఏడుస్తోంది అని అనగా అప్పుడు చంద్రమ్మ కళ్ళు తుడుచుకొని ఏమీ లేదు అని అబద్ధం చెబుతుంది. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరొకవైపు దీపా ఏమైంది డాక్టర్ బాబు ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను అని అడగగా ఏం లేదు దీప కళ్ళు తిరిగాయి అందుకే ఇక్కడికి తీసుకు వచ్చాను అని అనగా అంత చిన్న దానికి ఇక్కడ తీసుకొని రావాలా ఎంతో దూరం వెళ్లి మళ్లీ ఇంత దూరం వచ్చాము అని అనుకుంటూ ఉంటుంది దీప.
Read Also : Karthika Deepam Dec 8 Today Episode : చంద్రమ్మపై సీరియస్ అయిన ఇంద్రుడు.. సంతోషంలో సౌందర్య కుటుంబం..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World