...

Devatha: దేవుడమ్మకు మాట ఇచ్చిన దేవి..ఆదిత్యతో మీ ఇంటికి వస్తాను అని చెప్పిన రుక్మిణి..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ తన తల్లి దగ్గరికి వెళ్లి కావాలనే దొంగ ప్రేమ నటిస్తూ రాధకు అనుమానం వచ్చే విధంగా మాట్లాడుతాడు.

ఈరోజు ఎపిసోడ్లో మాధవ నేను జీవిత పరీక్ష రాయడానికి వెళ్తున్నాను నీ చేతి ముద్ద పెట్టి నేను ఆ పరీక్షలో నెగ్గాలి అని దీవించు అమ్మ అనగా అప్పుడు జానకి గోరుముద్దలు పెడుతూ ఉండగా ఇంతలోనే దేవుడమ్మ ఫోన్ చేస్తుంది. అప్పుడు జానకి దేవుడమ్మ అంటూ మాట్లాడడంతో మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు జానకి మాటలు విన్న రాధ లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. అప్పుడు కమలాకు బిడ్డ పుట్టింది బారసాలకు రమ్మని జానకికి చెప్పి దేవితో కూడా మాట్లాడుతుంది.

అప్పుడు దేవుడమ్మ నేను మీ అమ్మని చూడలేదు కదా బారసాలకు తీసుకుని రా అనడంతో కచ్చితంగా తీసుకొని వస్తాను అని అంటుంది దేవుడమ్మ. అప్పుడు దేవి మాటలకు రాధా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆదిత్య రాధకు ఫోన్ చేసి బారసాలకు రమ్మని చెప్పడంతో ఇంట్లో వాళ్లకు అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది అని అంటుంది. అప్పుడు రాద నేను కూడా వస్తాను అక్క కూతురు నాకు కూతురే కదా చూడాలని ఉంది అని అంటుంది.

ఇప్పుడు ఆదిత్య ఎలా వస్తావు అని అనగా ఇలా అయినా వస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తుంది రాద. మరొకవైపు కమలా బిడ్డకి ఇంట్లో అందరూ బారసాలకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందరూ హడావిడిగా కనిపిస్తూ ఉండగా అది చూసి కమల సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్యతో దేవుడమ్మ ఏర్పాట్ల గురించి అడుగుతూ ఉంటుంది.

అప్పుడు దేవుడు రామ్మూర్తి వాళ్ళ కుటుంబానికి కూడా చెప్పాము దేవిని వాళ్ళ అమ్మని పిలుచుకొని రమ్మని చెప్పాను అని అనటంతో ఆదిత్య షాక్ అవుతాడు. అప్పుడు ఆదిత్య కూడా రుక్మిణి ఇక్కడికి వస్తాను అనింది అని ఆలోచనలో పడతాడు ఆదిత్య. ఆ తర్వాత కమలా తన బిడ్డకి ఘనంగా ఏర్పాటు చేయడంతో దేవుడమ్మ దగ్గర ఎమోషనల్ అవుతుంది.

అప్పుడు దేవుడమ్మ అలా మాట్లాడకు అంటూ కమలకు ధైర్యం చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దేవుడమ్మ బంధువులను బారసాలకు రమ్మని చెబుతూ ఉంటారు. అప్పుడు దేవి రాధను బారసాలకు వెళ్దాం రా అమ్మ అని అనటంతో తర్వాత వస్తాను అని అంటుంది రాధ. అప్పుడు రాధా ప్రవర్తనలో కొద్ది రోజులుగా మార్పు ఉంది అని ఆలోచనలో పడుతుంది జానకి.