Intinti Gruhalakshmi Aug 15 Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సామ్రాట్, తులసి లను చూసి నందు లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి తో మాట్లాడుతూ మొదటిసారి ఫ్లైట్ ఎక్కావు కదా తులసి గారు ఎంజాయ్ చేయమని చెబుతాడు. తులసి కూడా ఫ్లైట్ ఎక్కినందుకు సంతోషంగా ఉంటుంది. వారి మాటలు విని తులసిని చూసిన నందు తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు లాస్య తులసి గురించి రన్నింగ్ కామెంట్స్ చేస్తూ నందుని మరింత రెచ్చగొడుతుంది.
Intinti Gruhalakshmi Aug 15 Today Episode : సంతోషంలో సామ్రాట్..
మరొకవైపు ప్రేమ్ శృతిని తీసుకొని రావడానికి శృతి వాళ్ళ అత్త ఇంటికి వెళ్తాడు. అక్కడ తాళం వేసి ఉండడంతో వెళ్లిపోవాలి అనుకోగా అప్పుడే అంకిత ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ప్రేమ అక్కడే ఉంటాడు. మరోవైపు తులసి ఫ్లైట్ లో ఎంజాయ్ చేస్తూ బాగా సంతోషంగా ఉంటుంది. తులసి ఆనందాన్ని చూసిన లాస్య నందుని రెచ్చగొడుతూ లేనిపోని మాటలు చెబుతుంది.
ఆ తర్వాత తులసి నిద్రపోతూ చలిగా ఉంది అనడంతో వెంటనే సామ్రాట్ తన కోటు తీసి తులసీకి కప్పుతాడు. అది చూసి నందు మరింత కోపంతో రగిలిపోతాడు. ఇక సామ్రాట్ తులసి వైపు అలా చూస్తూ ఉండగా తులసి మేలకువ వచ్చి పది నిమిషాల సమయాన్ని వృధా చేశాను అని అంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని అనౌన్స్ చేయడంతో కొందరు భయపడుతూ ఉంటారు.
అప్పుడు ఆ ఎయిర్ పోస్ట్ అందరూ పాజిటివ్ గా ఉండండి అని ధైర్యం చెబుతూ ఉండగా అందరూ ఆమెపై అరుస్తారు. అప్పుడు నందు కూడా ఆ హెయిర్ హోస్టుపై అరుస్తూ ఆమెను పక్కకు తోస్తాడు. వెంటనే తులసి ఆ అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడుతూ నందుని తిట్టడంతో నందు అందరి ముందు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. తులసి మాటలకు నందు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.
అప్పుడు తులసి అందరినీ దేవుడికి వేడుకోమని చెప్పి ధైర్యంగా ఉండమని సలహా ఇస్తుంది. ఆ తర్వాత టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అని అనౌన్స్ చేయడంతో అందరూ తులసికి సంతోషంతో ప్రశంసలు కురిపిస్తారు. ఆ తర్వాత ఫ్లైట్ దిగుతూ ఉండదా బత్తాయి బాలరాజు ఏదో ఒక రోజు వారి దగ్గర పెళ్లి చేసుకుంటారు అనటంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి వైజాగ్ చేరుకుంటారు. అక్కడ మూడు గదులు ఉండగా కానీ కేవలం రెండు గదులు మాత్రమే ఉంటాయి.
అప్పుడు సామ్రాట్ ఒక గది లాస్య దంపతులను తీసుకోమని చెప్పి తులసి,సామ్రాట్ కలిసి ఒక గదిలో ఉంటారు. అప్పుడు నందు మరింత కోపంతో రగిలిపోతూ భయపడుతూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడ ఒక ఆమె అలలో కొట్టుకుపోయింది అనగా నందు తులసి అంటే గట్టిగా అరుస్తాడు.