Raksha bandhan : దేశంతో పాటు, విదేశాల్లో ఉన్న వారు కూడా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న సౌదరీమణులు.. తమ సోదరుల ఇంటికి వెళ్లి ప్రేమాభిమానాలతో రాఖీని కడతారు. అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి గుర్తుగా రాఖీ వేడుకను జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజను ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. అయితే రాజస్థాన్ లో ఈరోజు అరుదైన సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక గ్రామంలోనికి చిరుత పులి వచ్చింది. దానికి ఒంటినిండా గాయాలు అయ్యాయి. కనీసం కద్దలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలోనే అక్కడి గ్రామస్థులంతా చిరుత పులి వద్దకు వ్చచారు.

దానికి సపర్యలు చేశారు. అంతే కాకుండా… ఒక మహిళ మరో అడుగు ముందుకేసి రక్షా బంధన్ రోజు రాఖీ కట్టింది. చిరుతను చూసి తన అన్నయ్యలా భావించి రాఖీ కట్టింది. పండుగ రోజు తన అన్నయ్యే త దగ్గరకు వచ్చినట్లుగా భావించి మురిసిపోయింది. ఈ దృశ్యాలను పక్కనే ఉన్న ఓ గ్రామస్థులు సెల్ ఫోన్ లో బంధించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టగా క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వీటిని చూసిన వారంతా చిరుత పులికి రాఖీ కట్టడం చాలా బాగుందంటూ, అక్కా నీ ధైర్యానికి సాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Constable crying: భోజనం బాగాలేదని వలవలా ఏడ్చిన పోలీస్ కానిస్టేబుల్..!