Raksha Bandhan: మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమినీ శ్రావణ మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ రోజున పెద్ద ఎత్తున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి తమకు అండగా ఉండాలని కోరుకోవడమే కాకుండా తమ సోదరులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకొని సుఖసంతోషాలతో ఉండాలని భావిస్తారు. అందుకే పెద్ద ఎత్తున రాఖీ పండుగ రోజు ఎంతో ఘనంగా సంతోషంగా అక్క చెల్లెలు అన్న తమ్ములకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుతారు. ఇదిలా ఉండగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కనుక ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ కొన్ని పరిహారాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైనే ఉండి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భావిస్తారు.మరి శ్రావణ పౌర్ణమి రోజు ఏ ఏ పరిహారాలు పాటించాలి అనే విషయానికి వస్తే…
రాఖీ పౌర్ణమి సందర్భంగా కేవలం చంద్రుడికి మాత్రమే కాకుండా నవగ్రహాలకు కూడా పూజ చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇలా గ్రహాల ప్రతికూల ప్రభావం తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. ఇకపోతే రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ సోదరీ సోదరీమణుల ఆశీర్వాదాలు తీసుకోవడమే కాకుండా పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.అలాగే ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకించి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.
Raksha Bandhan:
ఇకపోతే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ వారి శక్తి సామర్థ్యాలు మేర దానధర్మాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. రాఖీ పౌర్ణమి రోజు ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World