Astrology: ఆదాయం పెరగాలంటే ఉత్తర దిశలో ఈ వస్తువులు పెట్టాల్సిందే..!

Astrology: చాలా మంది లక్షల్లో సంపాదించిన ఇంట్లోకి మాత్రం రూపాయి రాదు. వచ్చినా ఎక్కువ సేపు నిలవదు. ఎప్పుడు చూడు అప్పులు, అప్పులు అని అంటూనే ఉంటారు. మరికొందరికి ఆదాయం తక్కువైనా.. సంపాదన వేలల్లోనే ఉన్నా వారి కంటే ఎక్కువ కూడబెడతారు. ఆస్తి పాస్తులు కొనుగోలు చేసుకుంటూ హాయిగా, సంతోషంగా జీవిస్తుంటారు. అయితే దీనంతటికి వాస్తు నియమాలే కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Advertisement

దరిద్ర లక్ష్మీ ఇంటిని వదిలి పోయి… అష్ట ఐశ్వర్యాలు, అవకాశాలు పెరగాలంటే… కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. మనం ఇళ్లు కట్టుకునేటప్పుడు దిశలను అనుసరించి నిర్మాణం చేపడతాం. అలాగే ఇంట్లోని వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా కుబేర స్థానంలో ఏ దోషం లేకపోతే… డబ్బులకు ఆటంకం ఏర్పడదు. అందుకే ఇళ్లు కట్టుకునే సమయాల్లోనే కుబేరుడి స్థానానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

Advertisement

ఉత్తమ మధ్య భాగంలో తప్పనిసరిగా ప్రధానంగా డబ్బు రావాల్సిన ప్రాంతం ఉత్తరం. ఈ స్థానానికి ప్రాధాన్యత ఎంత ఇస్తే… ఆర్థికంగా అంత బాగుంటుంది. ఉత్తర దిశలో డబ్బు పెట్టుకుంటే నిధి పెరుగుతుంది. నగలు కూడా పెట్టుకోవచ్చు. విలివైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపున బాత్రూంలు కట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. నిజానికి ఇత్తరం జలస్థానం అంటారు. ఇలా జల తత్వం దగ్గర అగ్నితత్వం పెట్టినా.. అది కూడా తప్పు అవుతుందట. డబ్బులు ఎప్పుడైనా ఉత్తర స్థానంలోనే పెట్టుకోవాలంట. దీంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని అంటారు. అందుకే నెలవారీ సరుకులు తెచ్చుకున్నా వాయువ్య దిశలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

Advertisement
Advertisement